Virat Kohli : ఇంతలా పరువు తీసుకోవడం అవసరమా కోహ్లీ.. జట్టు నుండి తప్పుకో అంటూ ఫైర్!
ప్రధానాంశాలు:
Virat Kohli : ఇంతలా పరువు తీసుకోవడం అవసరమా కోహ్లీ.. జట్టు నుండి తప్పుకో అంటూ ఫైర్!
Virat Kohli : విరాట్ కోహ్లీ గురించి కొన్నాళ్లుగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా ఆడడం లేదని, తప్పుకుంటే బెటర్ అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీకి చివరిది అని తెలుస్తుండగా, ఇప్పుడు ఓపెనింగ్‌కి వస్తున్నాడు. కెరీర్ మొదట్నుంచి ఫస్ట్ డౌన్‌లో ఆడుతూ వస్తున్నాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చి టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. అలాంటోడు కీలకమైన టీ20 వరల్డ్ కప్-2024లో ఓపెనింగ్‌లో ఆడుతూ పరుగులు రాబట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. యూఎస్ఏతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే సూపర్-8లో 24, 37 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో మాత్రం అతడు పరువు తీసుకున్నాడు.
Virat Kohli పాపం.. కోహ్లీ
ఆసీస్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వస్తాడనుకుంటే 5 బంతులు ఎదుర్కొన్న ఈ టాప్ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. జోష్ హేజల్‌వుడ్ బౌలింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. కోహ్లీ ఔట్ అయిన ఇదే పిచ్ మీద రోహిత్ భారీ షాట్లు బాదుతున్నాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయినా కోహ్లీ రన్స్ చేసేందుకు చాలా ఇబ్బండి పడ్డాడు. అతని బ్యాటింగ్ తీరు చూసి చాలా మంది విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఆట ఆడి పరువు తీసుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కింగ్‌ను ఓపెనర్‌గా ఆడించాలనేది అత్యాశ అని.. అతడు కూడా అదే కోరుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అత్యాశకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదని చెబుతున్నారు.
ఇక ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28)మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/45), మార్కస్ స్టోయినీస్(2/56) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమిపాలైంది. ట్రావిస్ హెడ్(43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.