Virat Kohli : భారత్ -పాక్ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా మారిందో మనందరం చూశాం. 6 పరుగులకి 16 పరుగులు అవసరమైన సమయంలో మ్యాచ్ అంతా ఉత్కంఠగా సాగింది. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి ఓవర్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పిన్నర్ నవాజ్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికే హార్దిక్ ఔట్ కాగా.. రెండో బంతికి కార్తీక్ సింగిల్ తీసి ఇచ్చాడు. మూడో బంతికి రెండు పరుగులు తీసిన విరాట్ కోహ్లి.. నాలుగో బంతిని సిక్స్‌గా మలిచాడు. కానీ బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో నో బాల్ ఇవ్వాలని విరాట్ కోరాడు. దీంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు.తర్వాతి బంతిని ఫ్రీ హిట్ కాగా.. నవాజ్ వైడ్ వేశాడు. మరుసటి బంతికి కోహ్లి బౌల్డ్ అయినప్పటికీ.. అది ఫ్రీ హిట్ కావడంతో మూడు పరుగులు తీసారు.
ఇక చివరి బంతిని నవాబ్ వైడ్ వేయగా, 1 బంతిలో 1 పరుగుగా మారింది. చివరి బంతికి మిడ్ ఆఫ్ మీదుగా గాల్లోకి లేపిన అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు అందరు నో బాల్ గురించే చర్చిస్తున్నారు. విరాట్ క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు కాబట్టి అది నో బాల్ కాదని వాదిస్తున్నారు. నో బాల్‌ను ఎందుకు సమీక్షించలేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అంపైర్లను ప్రశ్నించాడు. ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డయ్యాక.. అది డెడ్ బాల్ ఎందుకు కాలేదని ప్రశ్నిస్తూ హాగ్ ట్వీట్ చేశాడు. అంపైర్లు భారత్‌కు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసీర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదంపై ‘ది బ్రిడ్జ్’ అనే వెబ్‌సైట్ ఐసీసీ నిబంధనలతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
‘ఐసీసీ 20.1.1 నిబంధన ప్రకారం.. బంతి వికెట్ కీపర్ లేదా బౌలర్ చేతుల్లో పడితే (20.1.1.1), బౌండరీ బాదితే (201.1.2) అది డెడ్ బాల్ అవుతుంది. 20.1.1.3 నిబంధన ప్రకారం బ్యాటర్ అవుటైతే బంతిని వెంటనే డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. కానీ అది ఫ్రీ హిట్ కావడంతో.. నవాజ్ కోహ్లిని బౌల్డ్ చేసినప్పటికీ అది ఔట్ కాదు.. అలాగే బంతి డెడ్ కాదు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ కొట్టిన బంతి స్పైడర్ కెమెరాను తాకడంతో అంపైర్లు డెడె బాల్‌గా ప్రకటించారు’ అని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…
Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…
Groom Arrested : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని షాపూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. కాసేపట్లో వివాహం జరుగాల్సి ఉండగా పోలీసులు…
Vaibhav Suryavanshi : క్రికెట్లో ఐపీఎల్‌కి IPL 2024 ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యమా అని…
Meenakshi : సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. ఆ…
Akkineni Akhil Engagement : సమంత నుండి విడిపోయిన నాగ చైతన్య త్వరలో శోభితని వివాహం చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 4న…
Bull : అదుపుతప్పిన ఓ ఎద్దు పేట్రేగిపోయింది. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ 15 మందిని గాయపరిచింది. ఎద్దు స్వైర విహారానికి…
This website uses cookies.