Virat Kohli : విరాట్ కోహ్లికి వేసిన నోబాల్‌పై న‌డుస్తున్న, చ‌ర్చ‌.. అది క‌రెక్టా, రాంగా.. వీడియో ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : విరాట్ కోహ్లికి వేసిన నోబాల్‌పై న‌డుస్తున్న, చ‌ర్చ‌.. అది క‌రెక్టా, రాంగా.. వీడియో ..!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 October 2022,12:00 pm

Virat Kohli : భార‌త్ -పాక్ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా మారిందో మ‌నంద‌రం చూశాం. 6 ప‌రుగుల‌కి 16 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మ్యాచ్ అంతా ఉత్కంఠ‌గా సాగింది. అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. చివ‌రి ఓవ‌ర్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పిన్నర్ నవాజ్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికే హార్దిక్ ఔట్ కాగా.. రెండో బంతికి కార్తీక్ సింగిల్ తీసి ఇచ్చాడు. మూడో బంతికి రెండు పరుగులు తీసిన విరాట్ కోహ్లి.. నాలుగో బంతిని సిక్స్‌గా మలిచాడు. కానీ బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో నో బాల్ ఇవ్వాలని విరాట్ కోరాడు. దీంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు.తర్వాతి బంతిని ఫ్రీ హిట్ కాగా.. నవాజ్ వైడ్ వేశాడు. మరుసటి బంతికి కోహ్లి బౌల్డ్ అయినప్పటికీ.. అది ఫ్రీ హిట్ కావడంతో మూడు ప‌రుగులు తీసారు.

ఇక చివ‌రి బంతిని న‌వాబ్ వైడ్ వేయ‌గా, 1 బంతిలో 1 ప‌రుగుగా మారింది. చివ‌రి బంతికి మిడ్ ఆఫ్ మీదుగా గాల్లోకి లేపిన అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు అంద‌రు నో బాల్ గురించే చ‌ర్చిస్తున్నారు. విరాట్ క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు కాబట్టి అది నో బాల్ కాదని వాదిస్తున్నారు. నో బాల్‌ను ఎందుకు సమీక్షించలేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అంపైర్లను ప్రశ్నించాడు. ఫ్రీ హిట్‌ బంతికి కోహ్లి బౌల్డయ్యాక.. అది డెడ్ బాల్‌ ఎందుకు కాలేదని ప్రశ్నిస్తూ హాగ్ ట్వీట్ చేశాడు. అంపైర్లు భారత్‌కు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసీర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదంపై ‘ది బ్రిడ్జ్’ అనే వెబ్‌సైట్ ఐసీసీ నిబంధనలతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Virat Kohli no ball controversy on India vs Pakistan T20 World Cup match

Virat Kohli no ball controversy on India vs Pakistan T20 World Cup match

Virat Kohli : ఒక‌టే చ‌ర్చ‌..

‘ఐసీసీ 20.1.1 నిబంధన ప్రకారం.. బంతి వికెట్ కీపర్ లేదా బౌలర్ చేతుల్లో పడితే (20.1.1.1), బౌండరీ బాదితే (201.1.2) అది డెడ్ బాల్ అవుతుంది. 20.1.1.3 నిబంధన ప్రకారం బ్యాటర్ అవుటైతే బంతిని వెంటనే డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. కానీ అది ఫ్రీ హిట్ కావడంతో.. నవాజ్ కోహ్లిని బౌల్డ్ చేసినప్పటికీ అది ఔట్ కాదు.. అలాగే బంతి డెడ్ కాదు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ కొట్టిన బంతి స్పైడర్ కెమెరాను తాకడంతో అంపైర్లు డెడె బాల్‌గా ప్రకటించారు’ అని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది