virat kohli out at 88 runs against srilanka in icc world cup 2023
Virat Kohli : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జస్ట్ లో అరుదైన రికార్డును క్రియేట్ చేయడం మిస్ అయ్యాడు. నిజానికి ఈ మ్యాచ్ లోనే ఓ రికార్డును క్రియేట్ చేశాడు. వన్డేల్లో ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు సచిన్ పేరు మీద ఉన్న ఈ రికార్డును కోహ్లీ క్రాస్ చేశాడు. సచిన్ ఒక ఏడాదిలో 1000 పరుగులను ఏడు సార్లు చేశాడు. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం 8 సార్లు చేసి టాప్ ప్లేస్ లోకి వెళ్లాడు. దానితో పాటు వన్డేల్లో 49వ సెంచరీ చేయబోయి విరాట్ కోహ్లీ జస్ట్ మిస్ అయ్యాడు. 49వ సెంచరీ చేసి ఉంటే.. సచిన్ రికార్డును కూడా కోహ్లీ సమం చేసి ఉండేవాడు. కానీ జస్ట్ లో సెంచరీ మిస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. ఇప్పటి వరకు విరాట్ వన్డేల్లో 48 సెంచరీలు చేశాడు. ఒకవేళ ఇవాళ్టి మ్యాచ్ లో విరాట్ 49 సెంచరీలు చేసి ఉంటే.. సచిన్ రికార్డును సమం చేసి ఉండేవాడు.
94 బంతుల్లో 88 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మదుషంక బౌలింగ్ లో నిస్సాంకకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 11 ఫోర్లు కొట్టాడు. కానీ.. సిక్స్ ఒక్కటి కూడా కొట్టలేదు. ఇక..ఈ మ్యాచ్ తో సహా 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019 సంవత్సరాల్లో వన్డే మ్యాచ్ లలో వెయ్యికి పైగా పరుగులను కోహ్లీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ ఇప్పటి వరకు 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. ఇప్పటి వరకు 43 ఓవర్లు పూర్తయ్యాయి.
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో శనివారం…
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. తొలి దశలో…
This website uses cookies.