Virat Kohli : గెలిచాక‌.. విరాట్ కోహ్లీ గ్రౌండ్‌ని గ‌ట్టిగా గుద్ద‌డం వెన‌క అస‌లు కథ ఇది..!

Advertisement
Advertisement

Virat Kohli : భార‌త్ పాక్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో ఈ మ్యాచ్ లో భారత్ విజ‌యం క్రికెట్ అభిమానుల‌కి మంచి కిక్ ఇచ్చింది.పాకిస్థాన్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) అసాధారణ ఆటతీరుతో ఓటమి నుంచి గట్టెక్కించాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. విరాట్ సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది.

Advertisement

షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీకి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40) రాణించాడు.ఈ విజ‌యం మాత్రం అంద‌రికి మాంచి కిక్ ఇచ్చింది. అయితే విజయం తర్వాత పిడికిలితో నేలను బలంగా గుద్ది ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ ఇలా ఎమోషనల్ అవ్వడం ఇది రెండోసారి.

Advertisement

Virat Kohli story viral on Social media

Virat Kohli : ఇది అసలు క‌థ‌…!

2016 వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఇలానే ఎమోషనల్ అవుతాడు. తన వీరోచిత ఇన్నింగ్స్ తో జట్టును సెమీస్ కు చేర్చిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ మరుపురానిదే. అయితే మ్యాచ్ విన్నింగ్ త‌ర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. “2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నేను చివరిసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఇప్పటివరకు అదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్. ఈరోజు నేను దీన్ని అంతకంటే ఎక్కువగా లెక్కిస్తాను. నా 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఇవి మరపురాని రాత్రులు..” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో కడదాకా క్రీజులో ఉన్న కోహ్లీ తన వీరోచిత ఇన్నింగ్స్ తో దాయాది పాకిస్తాన్ పై మరుపురాని విజయాన్ని అందిచాడు. ఈ క్రమంలో నేలను పిడికిలితో బలంగా గుద్ది ఎమోషనల్ అయ్యాడు. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

Advertisement

Recent Posts

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

49 mins ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

2 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

3 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

4 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

5 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

6 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

7 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

8 hours ago

This website uses cookies.