Virat Kohli : గెలిచాక.. విరాట్ కోహ్లీ గ్రౌండ్‌ని గట్టిగా గుద్దడం వెనక అసలు కథ ఇది..!
Virat Kohli : భారత్ పాక్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరచడంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం క్రికెట్ అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది.పాకిస్థాన్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) అసాధారణ ఆటతీరుతో ఓటమి నుంచి గట్టెక్కించాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. విరాట్ సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది.
షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీకి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40) రాణించాడు.ఈ విజయం మాత్రం అందరికి మాంచి కిక్ ఇచ్చింది. అయితే విజయం తర్వాత పిడికిలితో నేలను బలంగా గుద్ది ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ ఇలా ఎమోషనల్ అవ్వడం ఇది రెండోసారి.

Virat Kohli story viral on Social media
Virat Kohli : ఇది అసలు కథ…!
2016 వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఇలానే ఎమోషనల్ అవుతాడు. తన వీరోచిత ఇన్నింగ్స్ తో జట్టును సెమీస్ కు చేర్చిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ మరుపురానిదే. అయితే మ్యాచ్ విన్నింగ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. “2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నేను చివరిసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఇప్పటివరకు అదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్. ఈరోజు నేను దీన్ని అంతకంటే ఎక్కువగా లెక్కిస్తాను. నా 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఇవి మరపురాని రాత్రులు..” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో కడదాకా క్రీజులో ఉన్న కోహ్లీ తన వీరోచిత ఇన్నింగ్స్ తో దాయాది పాకిస్తాన్ పై మరుపురాని విజయాన్ని అందిచాడు. ఈ క్రమంలో నేలను పిడికిలితో బలంగా గుద్ది ఎమోషనల్ అయ్యాడు. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
Diwali just came early #ViratKohli is back! pic.twitter.com/rH0mYKu0Lt
— Sonal MehrotraKapoor (@Sonal_MK) October 23, 2022