Yuvraj Singh : యూవీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తండ్రైన యువ‌రాజ్ సింగ్.. కొడుకా, కూతురా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Yuvraj Singh : యూవీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తండ్రైన యువ‌రాజ్ సింగ్.. కొడుకా, కూతురా..?

Yuvraj Singh :భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గుడ్ న్యూస్ చెప్పాడు. త‌న భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. దేవుడు మాకు కుమారుడిని ప్ర‌సాదించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు. లవ్, హాజెల్, యువరాజ్ అంటూ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :26 January 2022,9:00 am

Yuvraj Singh :భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గుడ్ న్యూస్ చెప్పాడు. త‌న భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. దేవుడు మాకు కుమారుడిని ప్ర‌సాదించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు. లవ్, హాజెల్, యువరాజ్ అంటూ యువీ చేసిన పోస్ట్ కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్‌గా మారింది. యువరాజ్ సింగ్ తండ్రి అయినందుకు అందరు అభినందనలు తెలుపుతున్నారు.

2011లో యువరాజ్ సింగ్, హజెల్ కీచ్ ఇద్దరికీ ఓ పార్టీలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్ళికి దారి తీసింది. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన 2011 సూపర్ హిట్ చిత్రం ‘బాడీగార్డ్’లో కరీనా కపూర్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో హాజెల్ నటించింది. అంతేకాకుండా పాపులర్ రియాలిటీ షో బిగ్‌‌బాస్ 7లో కూడా పాల్గొంది. కొన్నాళ్లు డేటింగ్ త‌ర్వాత ఈ ఇద్ద‌రు పెళ్లి పీట‌లెక్కారు. వీరి పెళ్లి కూడా సైలెంట్‌గానే జ‌రిగింది.యువరాజ్ అక్టోబర్ 2000లో కెన్యాపై వన్డేల్లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. చివరిసారిగా జూన్ 2017లో వెస్టిండీస్‌తో ఆడాడు.

yuvraj singh beacme father Baby boy

yuvraj singh beacme father Baby boy

Yuvraj Singh : అభిమానుల‌కి శుభ‌వార్త‌..

304 వన్డేల్లో అతను 14 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలతో సహా 55 సగటుతో 8701 పరుగులు చేశాడు. అదే సమయంలో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 58 టీ20ల్లో 1177 పరుగులు అతని పేరు మీద ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2007, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో హీరోగా నిలిచిన యువరాజ్ 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 T20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్‌పై ఒక ఓవర్‌లో 6 బంతుల్లో అతను 6 సిక్సర్లు బాదడం అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. 2022 ఫిబ్రవరి నుంచి క్రికెట్ మైదానంలోకి తిరిగి రావాలని యువరాజ్ సింగ్ భావిస్తున్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది