Credit Card : దుకాణాల్లో క్రెడిట్ కార్డ్‌పై 2 శాతం ఎక్కువ కటింగ్ చేస్తున్నారా.. అది ఎందుకు అంటే..!
Credit Card : ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువగా పెరుగుతూ పోతుంది. చిన్న ఎంప్లాయిస్ నుండి పెద్ద వాళ్ల వరకు కూడా క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. మనలో చాలా మందికి క్రెడిట్ కార్డులు సరిగ్గా ఉపయోగించని పక్షంలో అవి మీ జేబుపై ప్రభావం చూపుతాయని మర్చిపోకండి. క్రెడిట్ కార్డ్‌తో లింక్ అయిన అనేక ఛార్జీలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ప్రత్యక్ష ఛార్జీలు అయితే, స్వైప్ ఛార్జీలు వంటివి పరోక్షంగా కస్టమర్ నుండి తీసుకుంటారు. స్వైప్ ఛార్జీలు డౌట్ చాలామందికి వస్తుంది. రెస్టారెంట్‌లో బిల్లును చెల్లించినప్పుడు లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినప్పుడు, స్వైప్ ఛార్జ్ విధిస్తారు. దీనినే ఇంటర్‌చేంజ్ ఫీజు అని కూడా అంటారు. ఈ ఛార్జీలు సాధారణంగా కార్డ్ నెట్‌వర్క్ ద్వారా నిర్ణయిస్తారు. ఇవి క్రెడిట్ కార్డ్ చెల్లింపు వ్యవస్థలో భాగంగా ఉంటాయి.
కార్డ్ లావాదేవీపై, ఆ లావాదేవీ విలువలో దాదాపు 2% స్వైప్ ఛార్జీ ఉంటుంది. మరోవైపు, లావాదేవీ విలువలో 2.5 – 3% వరకు స్వైప్ ఛార్జీ ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జీలను వ్యాపారి చెల్లిస్తారు. కానీ ముందు చెప్పినట్టుగా.. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కస్టమర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. చాలా మంది వ్యాపారులు ఉత్పత్తులు, సేవల ధరలను పెంచుతారు. దీని అర్థం కస్టమర్ జేబులో నుండి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే స్వైప్ ఛార్జీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం.ఆర్బీఐ రూల్స్ తెలుసుకున్నట్లైతే 2 శాతం అదనపు ఛార్జీలకు నో చెప్పొచ్చు. కానీ, ఈ విషయం తెలియక క్రెడిట్ కార్డుదారులు షాపుల్లో 2 శాతం అదనపు ఛార్జీలను చెల్లిస్తుంటారు. ఇకపై మీరు షాపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డుతో బిల్ పే చేస్తే ఆర్బీఐ రూల్ చెప్పి లావాదేవీపై 2% అదనపు ఛార్జీ నుంచి తప్పించుకోవచ్చు.
Credit Card : దుకాణాల్లో క్రెడిట్ కార్డ్‌పై 2 శాతం ఎక్కువ కటింగ్ చేస్తున్నారా.. అది ఎందుకు అంటే..!
వ్యాపారి మీ నుండి స్వైప్ ఛార్జీలు తీసుకుంటున్నందు వల్ల, మీరు నగదు లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయాలా వద్దా అన్నది నిర్ణయించుకోగలరు. ఉత్పత్తి మొత్తం విలువపై స్వైప్ ఛార్జీల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మీరు ఉత్పత్తులు, సేవల కోసం మెరుగైన ప్రణాళిక, బడ్జెట్‌ను కూడా కలిగి ఉంటారు. మీరు కార్డ్ అందించే రివార్డ్‌లు, ప్రయోజనాలతో పాటు విధించిన స్వైప్ ఛార్జీలను కూడా కంపేర్ చేయవచ్చు. రివార్డ్‌లు.. స్వైప్ ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటేనే, కార్డ్‌ని యూజ్ చేయడం కరెక్ట్. లేకపోతే, మీరు మరో పేమెంట్ మెథడ్ కోసం వెదకాలి. అందుకే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే ముందు క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జీల గురించి అన్నింటినీ తనిఖీ చేయాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది మీ పాకెట్‌లను నేరుగా ప్రభావితం చేస్తుంది.
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…
భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…
Health Tips | వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర…
Heart Attack | ఇటీవల కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులతో పాటు యువతలోనూ తీవ్రమవుతున్నాయి. తక్కువ వయస్సులోనే అనేకమంది గుండెపోటు బారినపడి…
Moong Vs Masoor Dal | భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటంతోపాటు…
Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.…
This website uses cookies.