Ktr : ఇటీవల ఏపీ, తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎక్కడ చూసిన మధ్యలోకి బీజేపీని లాగుతుండడం హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రధానమంత్రి మోదీకి మాట ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అసెంబ్లీలోనూ తాను ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీయేనని, ఆ పార్టీలో చేరడం ఖాయమని పేర్కొన్నారు.
తన రాజకీయ అరంగేట్రం ఏబీవీపీలో ప్రారంభం అయిందని, బీజేపీ జెండా కప్పుకొని చనిపోతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తెలిసిందని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రితో ఈ విషయం చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని అన్నారు. అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిందని, అందులోనూ రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా చెప్పాలని కేటీఆర్ అడిగారు. దేశంలో అదానీకి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల రూపాయల అమృత్ టెండర్ల కుంభకోణం గురించి సాక్ష్యాలతో సహా బయటపెట్టారు.సీఎం బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని తెలిపారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే సంస్థను అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెరతీశారన్నారు. ఈ అక్రమాలపై సీఎం రేవంత్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెరతీసిన ఎందరో తమ పదవులను కోల్పోయారని, అదే పరిస్థితి రేవంత్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందించాలో తెలియడం లేదు.సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి సతీమణి తమ్ముడు అయితే సాక్ష్యాలతో నిరూపించాలి. కాని రేవంత్ బావమరిదికి ఇచ్చారు అనే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు, కాని ఎలా అనేది మాత్రం చెప్పడం లేదు.ఆధారాలతో బయటపెడితే కేంద్రం డైరెక్ట్‌గా చర్యలు తీసుకుంటుంది కదా అని కొందరు అంటున్న మాట. మరి రానున్న రోజులలో ఈ మేటర్ ఎక్కడి వరకు వెళుతుందా అని అందరు ముచ్చటించుకుంటున్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.