IPhone : యాపిల్ ఉత్ప‌త్తులు వ‌రుస పెడుతున్నాయి.. ఇక కొనేందుకు బీరెడీనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IPhone : యాపిల్ ఉత్ప‌త్తులు వ‌రుస పెడుతున్నాయి.. ఇక కొనేందుకు బీరెడీనా?

 Authored By sandeep | The Telugu News | Updated on :26 August 2022,9:40 pm

IPhone : యాపిల్ ఫోన్ అంటే మ‌క్కువ ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి. యాపిల్ ఫోన్ కొనాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఐఫోన్‌లో ఉన్న ఫీచ‌ర్స్ మ‌రే ఇత‌ర ఫోన్‌లో ఉండ‌వు. అయితే యాపిల్ వ‌రుస ఉత్ప‌త్తుల‌ని విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది. వార్తా సంస్థ‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల ప్ర‌కారం వ‌చ్చేనెల ప్రారంభంలో భార‌త మార్కెట్‌లో ఐ-ఫోన్‌14 సిరీస్ ఫోన్ల‌ను ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తున్న‌ది. భార‌త్‌లో ఐ-ఫోన్ల ఉత్ప‌త్తికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై వివిధ విడి భాగాల స‌ర‌ఫ‌రా దారుల‌తో ఆపిల్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. వ‌చ్చే దీపావ‌ళి నుంచి అంటే అక్టోబ‌ర్ 24 నుంచి భార‌త్‌లో ఐ-పోన్ 14 ఫోన్ల ఉత్ప‌త్తి ప్రారంభం కానున్న‌ది.

IPhone : యాపిల్ ఫోన్స్ క‌మింగ్..

కొత్తగా విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 14 మ్యాక్స్, ఐ ఫోన్ 14 ప్రొ, ఐ ఫోన్ 14 14 ప్రో మ్యాక్స్ వంటివి ఉంటాయి.ఈసారి ఐఫోన్ 12 సిరీస్‌తో ప్రారంభించిన ఐఫోన్ మినీ మోడల్‌ను స్క్రాప్ చేయాలని యాపిల్ నిర్ణయించింది. ఐఫోన్ 14 మినీతో సహా రాబోయే ఈవెంట్‌లో ఆపిల్ ఏడు ఉత్పత్తులను ఆవిష్కరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.రాబోయే ఈవెంట్‌లో సెప్టెంబర 7న బ్రాండ్ ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌లను విడుదల చేయనుంది. టాబ్లెట్‌లలో, బ్రాండ్ ఐప్యాడ్ 10.2, ఐప్యాడ్ ప్రో 12.9 మరియు ఐప్యాడ్ ప్రో 11లను కూడా పరిచయం చేస్తుందని తెలుస్తోంది.

Apple IPhone are Manufactures More Products

Apple IPhone are Manufactures More Products

సెప్టెంబర్ 7న యాపిల్ ఐ ఫోన్లు విడుదలవుతాయని, సెప్టెంబర్ 16 నుంచి అవి స్టోర్లలో అందుబాటులోకి వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇంత‌కుముందు ఐ-ఫోన్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన త‌ర్వాత వినియోగ‌దారుల ద‌రి చేర్చ‌డానికి ఆరు నెల‌ల నుంచి తొమ్మిది నెల‌ల స‌మ‌యం ప‌ట్టేది. కానీ ఈ ద‌ఫా గ‌డువు త‌గ్గించ‌డానికి ఆపిల్ ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ది. తైవాన్ అంశంపై అమెరికా, చైనా మ‌ధ్య విభేదాలు, భార‌త్‌తో చైనా స‌రిహద్దు వివాదం నేప‌థ్యంలో ఇండియాలోనూ ఐఫోన్‌-14 సిరీస్ ఫోన్ల ఉత్ప‌త్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆపిల్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది