Data Plans : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అన్ని పనులను ఫోన్ ద్వారా చేసుకుంటున్నారు. ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు అన్ని పనులు జరిగిపోతుంటాయి. అందుకే టెలికాం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ప్లాన్లు ప్రకటిస్తుంటాయి. పరిమితమైన డేటా, అన్లిమిటెడ్ కాల్స్, మెసేజ్ లు ఇలా వివిధ రకాల సదుపాయాలను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. విభిన్నమైన బెనిఫిట్స్ తో ప్రీ పేయిడ్ ప్లాన్లను అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఓ ప్లాన్ యూజర్ లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ ఇస్తున్న బెనిఫిట్స్ ను మరో టెలికాం సంస్థ ఇవ్వడం లేదు. రూ.398 ప్లాన్ తీసుకుంటే అన్లిమిటెడ్ డేటా అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. సాధారణంగా ఏ నెట్వర్క్ లో నైనా డేటా బెనిఫిట్స్ జీబీల ప్రకారం ఉంటుంది. ఒక జీబి, ఒకటిన్నర జిబి, రెండు జీబీలు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. కానీ బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ మాత్రం ప్రత్యేకంగా ఉంది. ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ డేటా జిబిల చొప్పున లిమిట్ ఏమీ ఉండదు. రోజులో ఎంత డేటా అయినా వినియోగించుకోవచ్చు. అది కూడా హై స్పీడ్ లో డేటాను పొందవచ్చు.
రూ.398 ప్లాన్ తో ఈ సదుపాయాలు దక్కనున్నాయి. ఎంత డేటా వాడుకున్న హై స్పీడ్ లోనే దక్కుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంది. అలాగే వోడాఫోన్ ఐడియా కూడా రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో ఇలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే ఫ్రీ పెయిడ్ లో అందించడం లేదు. మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉంటే రూ.398 ప్లాన్ తీసుకుంటే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ 3జి నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సంవత్సరంలో దేశంలో 4జీ నెట్వర్క్ లాంచ్ చేయాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తుంది. ఆగస్టులోనే 4జీ సేవలను తీసుకురావాలని చూసింది కానీ మళ్ళీ ఆలస్యమైంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.