Data Plans : మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్… రాబోతున్న అన్ లిమిటెడ్ డేటా ఆఫర్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Data Plans : మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్… రాబోతున్న అన్ లిమిటెడ్ డేటా ఆఫర్…

Data Plans : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అన్ని పనులను ఫోన్ ద్వారా చేసుకుంటున్నారు. ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు అన్ని పనులు జరిగిపోతుంటాయి. అందుకే టెలికాం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ప్లాన్లు ప్రకటిస్తుంటాయి. పరిమితమైన డేటా, అన్లిమిటెడ్ కాల్స్, మెసేజ్ లు ఇలా వివిధ రకాల సదుపాయాలను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,1:00 pm

Data Plans : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అన్ని పనులను ఫోన్ ద్వారా చేసుకుంటున్నారు. ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు అన్ని పనులు జరిగిపోతుంటాయి. అందుకే టెలికాం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ప్లాన్లు ప్రకటిస్తుంటాయి. పరిమితమైన డేటా, అన్లిమిటెడ్ కాల్స్, మెసేజ్ లు ఇలా వివిధ రకాల సదుపాయాలను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. విభిన్నమైన బెనిఫిట్స్ తో ప్రీ పేయిడ్ ప్లాన్లను అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఓ ప్లాన్ యూజర్ లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ ఇస్తున్న బెనిఫిట్స్ ను మరో టెలికాం సంస్థ ఇవ్వడం లేదు. రూ.398 ప్లాన్ తీసుకుంటే అన్లిమిటెడ్ డేటా అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. సాధారణంగా ఏ నెట్వర్క్ లో నైనా డేటా బెనిఫిట్స్ జీబీల ప్రకారం ఉంటుంది. ఒక జీబి, ఒకటిన్నర జిబి, రెండు జీబీలు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. కానీ బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ మాత్రం ప్రత్యేకంగా ఉంది. ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ డేటా జిబిల చొప్పున లిమిట్ ఏమీ ఉండదు. రోజులో ఎంత డేటా అయినా వినియోగించుకోవచ్చు. అది కూడా హై స్పీడ్ లో డేటాను పొందవచ్చు.

BSNL offerering unlimited data benefits

BSNL offerering unlimited data benefits

రూ.398 ప్లాన్ తో ఈ సదుపాయాలు దక్కనున్నాయి. ఎంత డేటా వాడుకున్న హై స్పీడ్ లోనే దక్కుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంది. అలాగే వోడాఫోన్ ఐడియా కూడా రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో ఇలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే ఫ్రీ పెయిడ్ లో అందించడం లేదు. మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉంటే రూ.398 ప్లాన్ తీసుకుంటే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ 3జి నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సంవత్సరంలో దేశంలో 4జీ నెట్వర్క్ లాంచ్ చేయాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తుంది. ఆగస్టులోనే 4జీ సేవలను తీసుకురావాలని చూసింది కానీ మళ్ళీ ఆలస్యమైంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది