Ghibli AI : జీబ్లీ స్టైల్ AI చిత్రాలు ఉచితంగా క్రియేట్ చేయాలనుకుంటే ఇలా చేయండి..!
ప్రధానాంశాలు:
Ghibli AI : జీబ్లీ స్టైల్ AI చిత్రాలు ఉచితంగా క్రియేట్ చేయాలనుకుంటే ఇలా చేయండి..!
Ghibli AI : రోజు రోజుకి టెక్నాలజీ పరుగులు పెడుతుంది. ఇప్పుడు అంతా కూడా ఏఐ హవా నడుస్తుంది. అయితే జీబ్లీ స్టైల్ AI ఇమేజ్‌లని ఇప్పుడు చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇవి చేత్తో గీసినట్టే ఉంటున్నాయి. . ఉచితంగా జీబ్లీ స్టైల్ AI ఇమేజెస్ సృష్టించడం ఎలా? అంటే ముందుగా chat.openai.com ఓపెన్ చేసి, మీ Google ID తో లాగిన్ అవ్వండి లేదా కొత్త ఓపెన్ఏఐ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లాగిన్ అయ్యాక, “New Chat” ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఎలాంటి బొమ్మ కావాలో వివరంగా టైప్ చేయండి.

Ghibli AI : జీబ్లీ స్టైల్ AI చిత్రాలు ఉచితంగా క్రియేట్ చేయాలనుకుంటే ఇలా చేయండి..!
Ghibli AI ఇలా చేయండి..
ఉదాహరణకు, “సూర్యాస్తమయం వేళ జీబ్లీ స్టైల్ గ్రామం.” స్టెప్ 2: “ఎంటర్” నొక్కండి. చాట్‌జీపీటీ మీరిచ్చిన వివరాలతో చిత్రాలు క్షణాల్లో సృష్టిస్తుంది. ఇమేజ్ కనిపించాక, దానిపై క్లిక్ చేసి “Save image as…” ఆప్షన్‌తో మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి. మంచి చిత్రాలు రావాలంటే, మూడ్, సెట్టింగ్, వివరాలు స్పష్టంగా చెప్పాలి.
చాట్‌జీపీటీ 4o ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఫ్రీ, పెయిడ్ యూజర్లు ఇద్దరూ వాడవచ్చు. కానీ, ఫ్రీ అకౌంట్ వాడేవారికి ప్రస్తుతం రోజుకు 3 బొమ్మలు గీసే అవకాశం మాత్రమే ఉంది. ఈ AI, స్టూడియో వ్యవస్థాపకుడు హయావో మియాజాకి స్ఫూర్తితో, కలలాంటి, చేత్తో గీసినట్లుండే బొమ్మలను సృష్టిస్తోంది. అయితే, ఈ ట్రెండ్ కొన్ని నైతిక ప్రశ్నలనూ లేవనెత్తింది. కాపీరైట్ ఉన్న బొమ్మల నుంచి AI నేర్చుకుని కొత్తవి సృష్టించడం, దీనివల్ల ఆర్టిస్టుల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు.