Home » News » Digital Transactions Are Very Easy With Upi Payments
News

UPI Pin Change : డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే UPI పిన్ మార్చుకోవచ్చు..ఎలా అంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: March 12, 2025 10:37 am
Advertisement

UPI Pin Change : ప్రస్తుతం డిజిటల్ యుగంలో డబ్బు లావాదేవీలు అత్యంత వేగంగా, సులభంగా జరగడానికి యూపీఐ (Unified Payments Interface) ఎంతో సహాయపడుతోంది. మన దేశంలో లక్షలాది మంది ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీల కోసం యూపీఐని వినియోగిస్తున్నారు. బ్యాంకులు లేదా ఏటీఎంలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డబ్బు బదిలీ చేసుకునే వీలుంటుంది. అభివృద్ధి చెందిన నగరాల నుంచి, మారుమూల గ్రామాల వరకు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో యూపీఐ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఈ డిజిటల్ వ్యవస్థను సురక్షితంగా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం.

Advertisement

UPI Pin Change : డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే UPI పిన్ మార్చుకోవచ్చు..ఎలా అంటే..!

UPI Pin Change : UPI పిన్ మార్పు అవసరమా?

UPI ద్వారా లావాదేవీలు చేయడానికి UPI పిన్ చాలా కీలకమైనది. చాలా మంది ఒకే UPI పిన్‌ను సంవత్సరాల పాటు ఉపయోగిస్తూ ఉంటారు. ఇది సైబర్ మోసాలకు అవకాశం కల్పిస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. కాలానుగుణంగా UPI పిన్ మార్చడం చాలా అవసరం. ముందుగా UPI పిన్ మార్చడానికి డెబిట్ కార్డ్ తప్పనిసరి ఉండేది. కానీ ప్రస్తుతం కొత్త నియమాలు ప్రవేశపెట్టడంతో డెబిట్ కార్డ్ అవసరం లేకుండా ఆధార్ OTP ద్వారా కూడా పిన్ మార్చే అవకాశం ఉంది.

Advertisement

UPI Pin Change : డెబిట్ కార్డ్ లేకుండా UPI పిన్ మార్పు ఎలా అంటే..?

డెబిట్ కార్డ్ లేకుండా UPI పిన్ మార్చాలంటే, ముందుగా యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలతో లాగిన్ అవ్వాలి. తర్వాత యూపీఐ పిన్ మార్చాలనుకునే బ్యాంక్ ఖాతాను ఎంచుకొని, పిన్ సెట్ చేసే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ “డెబిట్ కార్డ్” మరియు “ఆధార్ OTP” అనే రెండు ఎంపికలు ఉంటాయి. ఆధార్ OTP ఎంపికను ఎంచుకుని, మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ఇలా చేసి కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడం ద్వారా డెబిట్ కార్డ్ లేకుండా కూడా UPI పిన్‌ను సులభంగా మార్చుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల భద్రత కోసం ఈ ప్రక్రియను ప్రతి కొంతకాలానికి పాటించాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి