UPI Pin Change : డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే UPI పిన్ మార్చుకోవచ్చు..ఎలా అంటే..!
ప్రధానాంశాలు:
UPI Pin Change : డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే UPI పిన్ మార్చుకోవచ్చు..ఎలా అంటే..!

UPI Pin Change : డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే UPI పిన్ మార్చుకోవచ్చు..ఎలా అంటే..!
UPI Pin Change : ప్రస్తుతం డిజిటల్ యుగంలో డబ్బు లావాదేవీలు అత్యంత వేగంగా, సులభంగా జరగడానికి యూపీఐ (Unified Payments Interface) ఎంతో సహాయపడుతోంది. మన దేశంలో లక్షలాది మంది ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీల కోసం యూపీఐని వినియోగిస్తున్నారు. బ్యాంకులు లేదా ఏటీఎంలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డబ్బు బదిలీ చేసుకునే వీలుంటుంది. అభివృద్ధి చెందిన నగరాల నుంచి, మారుమూల గ్రామాల వరకు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో యూపీఐ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఈ డిజిటల్ వ్యవస్థను సురక్షితంగా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం.
UPI Pin Change : UPI పిన్ మార్పు అవసరమా?
UPI ద్వారా లావాదేవీలు చేయడానికి UPI పిన్ చాలా కీలకమైనది. చాలా మంది ఒకే UPI పిన్‌ను సంవత్సరాల పాటు ఉపయోగిస్తూ ఉంటారు. ఇది సైబర్ మోసాలకు అవకాశం కల్పిస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. కాలానుగుణంగా UPI పిన్ మార్చడం చాలా అవసరం. ముందుగా UPI పిన్ మార్చడానికి డెబిట్ కార్డ్ తప్పనిసరి ఉండేది. కానీ ప్రస్తుతం కొత్త నియమాలు ప్రవేశపెట్టడంతో డెబిట్ కార్డ్ అవసరం లేకుండా ఆధార్ OTP ద్వారా కూడా పిన్ మార్చే అవకాశం ఉంది.
UPI Pin Change : డెబిట్ కార్డ్ లేకుండా UPI పిన్ మార్పు ఎలా అంటే..?
డెబిట్ కార్డ్ లేకుండా UPI పిన్ మార్చాలంటే, ముందుగా యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలతో లాగిన్ అవ్వాలి. తర్వాత యూపీఐ పిన్ మార్చాలనుకునే బ్యాంక్ ఖాతాను ఎంచుకొని, పిన్ సెట్ చేసే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ “డెబిట్ కార్డ్” మరియు “ఆధార్ OTP” అనే రెండు ఎంపికలు ఉంటాయి. ఆధార్ OTP ఎంపికను ఎంచుకుని, మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ఇలా చేసి కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడం ద్వారా డెబిట్ కార్డ్ లేకుండా కూడా UPI పిన్‌ను సులభంగా మార్చుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల భద్రత కోసం ఈ ప్రక్రియను ప్రతి కొంతకాలానికి పాటించాలి.