
Phone : తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లతో ఫోన్ కావాలా..? అయితే ఇదే మీకు బెస్ట్..!
Phone : రూ. 25,000 లోపు బడ్జెట్‌లో నూతన ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నవారికి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మరియు రియల్‌మీ P3 ప్రో రెండూ మంచి ఫోన్లు. డిజైన్ మరియు డిస్ప్లే విషయానికి వస్తే.. మోటరోలా ఫోన్ 3D సిలికాన్ లెదర్ బ్యాక్‌తో స్టైలిష్ లుక్‌ని అందించగా, తక్కువ బరువు (180 గ్రాములు) తో హ్యాండ్లింగ్ సౌకర్యంగా ఉంటుంది. దీనిలోని 6.67 అంగుళాల POLED స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్‌తో వస్తుంది. అదే సమయంలో రియల్‌మీ P3 ప్రోలో పెద్ద 6.83 అంగుళాల AMOLED స్క్రీన్, అదే రిజల్యూషన్, రిఫ్రెష్ రేట్ ఉన్నా, 1500 నిట్స్ బ్రైట్నెస్ మాత్రమే ఉంది. డిజైన్ పరంగా మోటరోలా కొంచెం ప్రీమియం అనిపిస్తుంది.
Phone : తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లతో ఫోన్ కావాలా..? అయితే ఇదే మీకు బెస్ట్..!
బ్యాటరీ మరియు ఛార్జింగ్ పరంగా రియల్‌మీ P3 ప్రో కాస్త ఎక్కువ పవర్ ఇస్తుంది. ఇందులో 6000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో, ఎక్కువ సమయం నడిచే సామర్థ్యం ఉంది. అదే సమయంలో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లో 5500mAh బ్యాటరీ, 68W ఛార్జింగ్ తో వస్తుంది. ఛార్జర్ రెండింటిలోనూ బాక్స్‌లోనే వస్తుంది.కెమెరా విషయానికి వస్తే.. మోటరోలా స్పష్టమైన ఆధిక్యం చూపుతుంది. ఇది 50MP ప్రైమరీ, 13MP అల్ట్రా వైడ్, లైట్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెట్‌అప్‌ను కలిగి ఉంది. 32MP ఫ్రంట్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ తో ఇది సెల్ఫీ మరియు వీడియోల కోసం ఉత్తమ ఎంపిక.
ప్రాసెసర్ మరియు సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, రియల్‌మీ P3 ప్రోలో Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ ఉండడం గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది 90fps వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ మోటరోలా డివైస్ లో Dimensity 7400 ప్రాసెసర్‌తో పాటు, హలో UI స్కిన్ మరియు 3 సంవత్సరాల Android అప్‌డేట్స్, 4 సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ ఉన్నాయి. దీంతో దీర్ఘకాలికంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కోరే వారికి ఇది మంచి ఎంపిక. మొత్తం మీద, డిజైన్, కెమెరా, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కోసం మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఉత్తమ ఎంపిక కాగా, గేమింగ్ మరియు బ్యాటరీ పరంగా రియల్‌మీ P3 ప్రో మెరుగైనదిగా చెప్పవచ్చు.
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
This website uses cookies.