Ys Jagan : జగన్ కు కోలులేని దెబ్బ తగలబోతుందా..?
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస పరాజయాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వదిలి ఇతర పార్టీలలో చేరుతుండగా, ఇప్పుడు మరో కీలక నేత వైసీపీకి గుడ్‌బై చెప్పే సంకేతాలు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Ys Jagan : జగన్ కు కోలులేని దెబ్బ తగలబోతుందా..?
జక్కంపూడి కుటుంబానికి వైఎస్ కుటుంబంతో ఆత్మీయ సంబంధాలున్నా కూడా, జక్కంపూడి గణేష్‌కి పార్టీ నాయకత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న అభిప్రాయం ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఓ నేత పెత్తనం పెరిగిపోవడంతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని, ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని గణేష్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో ప్రెస్‌మీట్ పెట్టి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు.
జక్కంపూడి గణేష్ వైసీపీని వీడితే, జక్కంపూడి రాజాకు అది తీవ్రంగా నష్టంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన రాజా, ఇప్పుడు కుటుంబంలోని మరో కీలక వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతే రాజకీయంగా మరింత ఒత్తిడికి లోనవుతారు. ఈ పరిణామాలతో వైసీపీకి తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రెస్‌మీట్‌లో గణేష్ ఏమి వెల్లడించబోతున్నారో ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
Best Fish : చాలామంది చెబుతూనే ఉంటారు చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినడానికి…
Vastu Tips : చాలామందికి కూడా ఒక గృహం ని నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. నెరవేరినప్పుడు ఎంతో ఆనందంతో…
Numerology : న్యూమరాలజి ప్రకారం సంఖ్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యక్తి భవిష్యత్తు తెలియజేస్తుంది. పుట్టిన తేదీలు, పేర్లు…
Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…
Uppal : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…
Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…
Snake : మహబూబ్‌నగర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…
Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…
This website uses cookies.