E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైన దృష్టిసారిస్తున్నారు. మీరు పెట్రోల్ టూవీలర్ వాడి, మనీ అంతా పెట్రోల్‌కే ఖర్చు అయిపోతోంది అని అనుకుంటే.. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ఎంచుకోవచ్చు. దీనికి మైలేజ్ ఎక్కువ ఉంది. ఆఫర్ ఉంది. టెస్ట్ రైడ్ కూడా చెయ్యవచ్చు. నచ్చితే కొనుక్కోవచ్చు. మరి ఆ సైకిల్ పేరు హమ్ భారత దేశ మొదటి మల్టీ యుటిలిటీ ఈ-సైకిల్ అని ప్రచారంలో ఉంది. దీన్ని కార్గో ఈ-సైకిల్ అని కూడా అంటున్నారు.. అందువల్ల సామాన్లు తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. ఈ సైకిల్ 120 కేజీల లోడ్‌ని మొయ్యగలదు. రోజువారీ అవసరాలకు చాలా బాగుంటుంది. అన్ని రకాల రోడ్లపై వెళ్లగలదని అంటున్నారు.బ
ఈ సైకిల్ బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 105 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీ ఉంది. బ్యాటరీని బయటకు తియ్యవచ్చు. అలాగే.. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సైకిల్ కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే.. దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు. ఈ సైకిల్‌ని విరగకుండా ఉండేలా తయారు చేసినట్టు తెలుస్తుంది.. దీనికి యూనిక్ ట్రెల్స్ డిజైన్ ఉండడంతో దీనిని రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు. టిగ్ వెల్డెడ్ స్టీల్ ఫ్రేమ్ వాడారు. దీనికి IP 67 ఉంది. అందువల్ల ఇది నీటిలో వెళ్లిన కూడా పాడవదు. ఈ సైకిల్ బరువు దాదాపే 27 కేజీల వరకు ఉంటుంది. ఈ సైకిల్‌కి పెద్ద సీటు ఉండడంతో పాటు 15కి పైగా యాక్సెసరీలు తీసుకెళ్లేలా ఇచ్చారు.
ఇంకా.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇందులో పెడల్ అసిస్ట్, స్పోర్ట్స్ మోడ్, ఎకో మోడ్ ఉంది కాబట్టి మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని ప్రయాణించవచ్చు. 9 సెకన్లలో గంటకు 25కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అలాగే.. ఈ సైకిల్‌కి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. మల్టీ ఫంక్షనల్ డిస్‌ప్లే , షాకర్‌తో స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది. ఇంకా పవర్‌ఫుల్ హెడ్ అండ్ టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఈ సైకిల్‌ని మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. జీపీఎస్ ట్రాకర్‌తో ఎక్కడుందో లొకేట్ చేసుకునే విధంగా కూడా దీనిని రూపొందించడం విశేషం. నాలుగు రంగులలో ఈ సైకిల్ లభ్యం కానుంది. ఆరెంజ్, బ్లాక్, బెర్రీ బ్లూ, కార్బన్ గ్రే కలర్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ-సైకిల్ ధర రూ.31,349 ఉండగా, ఈఎంఐలో రూ.3,999కి పొందొచ్చు. వినియోగదారులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.