Flipkart Diwali sale : ఫ్లిప్‌కార్ట్ దివాళీ బ్యాక్ టు బ్యాక్ సేల్.. ఈసారి స్పెషల్ ఆఫర్స్ దేనిమీదంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flipkart Diwali sale : ఫ్లిప్‌కార్ట్ దివాళీ బ్యాక్ టు బ్యాక్ సేల్.. ఈసారి స్పెషల్ ఆఫర్స్ దేనిమీదంటే?

 Authored By mallesh | The Telugu News | Updated on :2 October 2022,1:00 pm

Flipkart Diwali sale : దసరా పండుగ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ దిగ్గజం ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది. ఇది ఇంకా దేశంలో కొనసాగుతోంది. అయితే,మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ దివాళీ సేల్ డేట్స్ ప్రకటించడంతో ఫ్లిప్‌కార్ట్ కూడా దీపావళి పండుగను దృష్టిలోపెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ ఈ సేల్‌ను ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇందులో వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయని తెలిపింది.సెప్టెంబర్ 30తో బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగుస్తుండటంతో మరో సేల్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అనంతరం దివాళీ సేల్ ప్రారంభం కానుంది.

దీపావళి సందర్భంగా ఈ బిగ్ దివాళీ సేల్‌ను వినియోగదారులకు అందించనున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించిన తేదీల వివరాలను ఫ్లిప్‌కార్ట్‌ ఒక్కసారిగా ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ఈ దివాళీ సేల్‌ ఉంటుందని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్‌కు సంబంధించిన తేదీలను బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేస్తున్నపోస్టర్ ఒకటి విడుదలైంది. దీనిప్రకారం ఎప్పటిలాగానే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. నార్మల్ వినియోగదారులకు అక్టోబర్ 5న ఈ సేల్ ప్రారంభం కానుంది.

flipkart diwali back to back sale huge discount offers for you

flipkart diwali back to back sale huge discount offers for you

Flipkart Diwali sale : దివాళీ సేల్ ఎప్పుడంటే..

అయితే, ఈ దివాళీ సేల్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10శాతం వరకు అదనపు డిస్కౌంట్ లభించనుందని తెలుస్తోంది.బిగ్ బిలియన్ డేస్‌లోనూ ఈ ఆఫర్స్ వర్తించాయి. ప్రముఖ అంతర్జాతీయ ఉత్పత్తులు అయిన యాపిల్, శాంసంగ్‌, రియల్‌మీ, పోకో, షావోమీ స్మార్ట్‌ఫోన్‌లపై దివాళీ సేల్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్లు లభించనున్నాయి.స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు,గృహోపకరణాలపై భారీ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ను సత్వరమే వినియోగించుకునేలా ఫ్లిప్ కార్ట్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టింది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది