Google Pixel 10a Review : భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10a విడుదల.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Google Pixel 10a Review : భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10a విడుదల.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 February 2026,8:00 am

Google Pixel 10a Review : ఎప్పటి నుంచో టెక్ ప్రియులు ఎదురుచూస్తున్న Google Pixel 10a ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. పిక్సెల్ ‘A’ సిరీస్‌లో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో గూగుల్ ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 18, 2026 బుధవారం విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ Flipkart, గూగుల్ ఇండియా స్టోర్లలో ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి.

Google Pixel 10a Review భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10a విడుదల ధర ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే

Google Pixel 10a Review : భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10a విడుదల.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!

Google Pixel 10a Review : ధర, ఆఫర్లు

భారత్‌లో Google Pixel 10a (8GB RAM + 256GB Storage) ధర రూ.49,999 గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ కింద HDFC బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ పై అదనపు బోనస్ కూడా పొందవచ్చు. మార్చి 6 నుండి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.

Google Pixel 10a Review : కొత్త డిజైన్ అండ్ డిస్‌ప్లే

ఈసారి పిక్సెల్ 10a డిజైన్లో పెద్ద మార్పు చేసింది. వెనుక వైపు ఉండే కెమెరా బార్ Camera Bar ఇప్పుడు ఉబ్బెత్తుగా లేకుండా, ఫోన్ బాడీతో సమానంగా Flush Design రావడం విశేషం. 6.3-అంగుళాల Actua OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్పీరియన్స్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది.

కెమెరా హైలైట్స్ Camera Specs

పిక్సెల్ అంటేనే కెమెరా కదా. Pixel 10a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 48MP (OIS తో) తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు తీస్తుంది. 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13MP ఫ్రంట్ కెమెరా, కొత్తగా “Camera Coach” అనే ఫీచర్‌ను జతచేశారు. ఇది ఫోటోలు తీసేటప్పుడు ఫ్రేమింగ్ ఎలా ఉండాలో సలహాలు ఇస్తుంది.

ప్రాసెసర్ అండ్ బ్యాటరీ

ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. పిక్సెల్ 10 సిరీస్ అయినప్పటికీ, ఇందులో Tensor G4 చిప్‌సెట్‌ను వాడారు (ఇది Pixel 9 సిరీస్‌లో ఉన్నదే). అయినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, మ్యాజిక్ ఎరేజర్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. 5,100mAh భారీ బ్యాటరీ (గత మోడల్ కంటే బెటర్), 30W వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఈ ఫోన్ లేటెస్ట్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. గూగుల్ దీనికి ఏకంగా 7 సంవత్సరాల పాటు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే 2033 వరకు మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ పరంగా కొత్తగానే ఉంటుంది. రూ.50,000 లోపు మంచి కెమెరా, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, లేటెస్ట్ AI ఫీచర్లు కావాలనుకునే వారికి Pixel 10a ఒక మంచి ఆప్షన్. గేమింగ్ కంటే ఫోటోగ్రఫీ, సాఫ్ట్‌వేర్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ చాయిస్.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది