NASA Artemis 2 Wet Dress Rehearsal : నాసా ఆర్టెమిస్ 2 ప్రయోగంలో లీక్ కలకలం.. 26.5 లక్షల లీటర్ల ఇంధనంతో ‘వెట్ రీహర్సల్’ పూర్తి!

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: February 3, 2026, 12:00 pm
  • ఆర్టెమిస్ 2 మిషన్ కోసం కీలకమైన ‘వెట్ డ్రెస్ రీహర్సల్’ పూర్తి
  • రాకెట్‌లో 26.5 లక్షల లీటర్ల ఇంధనాన్ని నింపిన నాసా
  • టెస్టింగ్ సమయంలో హైడ్రోజన్ లీక్.. వెంటనే అప్రమత్తమైన ఇంజనీర్లు

NASA Artemis 2 Wet Dress Rehearsal : అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (NASA) సిద్ధమైంది. ప్రతిష్టాత్మకమైన ఆర్టెమిస్ 2 (Artemis 2) మిషన్‌లో భాగంగా గురువారం (ఫిబ్రవరి 2) అత్యంత కీలకమైన “వెట్ డ్రెస్ రీహర్సల్” (Wet Dress Rehearsal) నిర్వహించింది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్, ప్యాడ్ 39B వద్ద ఉన్న స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్‌లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టింది.

NASA Artemis 2 Wet Dress Rehearsal : నాసా ఆర్టెమిస్ 2 ప్రయోగంలో లీక్ కలకలం.. 26.5 లక్షల లీటర్ల ఇంధనంతో ‘వెట్ రీహర్సల్’ పూర్తి!

NASA Artemis 2 Wet Dress Rehearsal : నాసా ఆర్టెమిస్ 2 ప్రయోగంలో లీక్ కలకలం.. 26.5 లక్షల లీటర్ల ఇంధనంతో ‘వెట్ రీహర్సల్’ పూర్తి!

NASA Artemis 2 Wet Dress Rehearsal : 26.5 లక్షల లీటర్ల ఇంధనం.. మధ్యలో లీక్

ఈ పరీక్షలో భాగంగా రాకెట్‌లోకి దాదాపు 7 లక్షల గ్యాలన్ల (సుమారు 26.5 లక్షల లీటర్లు) క్రయోజెనిక్ లిక్విడ్ హైడ్రోజన్ (LH2), లిక్విడ్ ఆక్సిజన్ (LOX)ను లోడ్ చేశారు. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగుతుండగా ఊహించని విధంగా ఇంధన లీక్ (Fuel Leak) వెలుగుచూసింది.

లిక్విడ్ హైడ్రోజన్ (LH2) లోడింగ్ జరుగుతుండగా ఈ లీక్ సమస్య తలెత్తింది. హైడ్రోజన్ సూపర్ చిల్డ్ గ్యాస్ కావడంతో చిన్నపాటి చీలికలు రావడం, లీక్ అవ్వడం రాకెట్ ప్రయోగాల్లో సాధారణమేనని నిపుణులు అంటున్నారు. అదృష్టవశాత్తూ, సమస్యను గుర్తించిన వెంటనే నాసా ఇంజనీరింగ్ టీమ్ అప్రమత్తమై దానిని పరిష్కరించింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. జనవరి 31న ప్రారంభమైన ఈ ఇంధన పరీక్ష రెండు రోజుల పాటు కొనసాగి, రాకెట్ ట్యాంకులు పూర్తిగా నిండటంతో ముగిసింది.

NASA Artemis 2 Wet Dress Rehearsal : లాంచ్ ఎప్పుడు?

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 6న ప్రయోగం జరగాల్సి ఉండగా, వాతావరణ సమస్యల కారణంగా వెట్ రీహర్సల్ ఆలస్యమైంది. దీంతో లాంచ్ డేట్ ఫిబ్రవరి 8కి (Artemis 2 Launch Date) మారే అవకాశం ఉంది. అయితే, ఈ టెస్ట్ అధికారికంగా ఎంతవరకు విజయవంతమైందనే విషయాన్ని నాసా ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 3 (మంగళవారం) మధ్యాహ్నం జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

నలుగురు వ్యోమగాములతో చందమామ యాత్ర

ఈ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు సిద్ధంగా ఉన్నారు. నాసా అస్ట్రోనాట్స్ రీడ్ విశ్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌లతో పాటు కెనడా అస్ట్రోనాట్ జెరెమీ హ్యాన్సన్.. వీరంతా 10 రోజుల పాటు చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరిగి రానున్నారు.

50 ఏళ్ల తర్వాత మళ్లీ

1969లో అపోలో మిషన్ ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన తర్వాత, దాదాపు 50 ఏళ్లుగా మానవులు భూకక్ష్య దాటి వెళ్ళలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ, భవిష్యత్తులో అంగారక గ్రహం (Mars) పైకి వెళ్లేందుకు ఆర్టెమిస్ 2 ఒక బేస్‌గా ఉపయోగపడనుంది. చంద్రునిపై కాలనీ ఏర్పాటు, న్యూక్లియర్ పవర్ రియాక్టర్ వంటి భారీ ప్రాజెక్టులకు ఇది నాంది కానుంది.

ఆర్టెమిస్ 1 ప్రయోగం సమయంలోనూ ఇలాంటి ఇంధన లీక్ సమస్యలే వచ్చాయని, దీనివల్ల ప్రయోగం నెలల పాటు వాయిదా పడిందని గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు ఆర్టెమిస్ 2 ఆ అవాంతరాలను దాటుకుని ఎప్పుడు నింగిలోకి ఎగురుతుందో చూడాలి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp