UPI Transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..!
UPI Transaction : ప్రస్తుతం దేశం మొత్తం తమ పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ ద్వారానే అంటే యు.పి.ఐ వారా చేస్తున్నారు. నగదు రహిత చెల్లింపులను ఎంకరేజ్ చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పేమెంట్స్ జరగాలని ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. ఎవరైనా ఎక్కడైనా వారి ఆర్ధిక లావాదేవీలను యు.పి.ఐ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు భారీగా పెరిగే పండగ లాంటి సమయాల్లో వీటి వాడకం మరింత ఎక్కువ ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు అంటే స్కానర్, క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ నెంబర్ కి డైరెక్ట్ గా చెల్లించడం లాంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం యు.పి.ఐ పేమెంట్స్ ను 5 లక్షల ఆకా పెంచడం జరిగింది. ఇది వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. గతంలో యు.పి.ఐ ట్రాన్ సాక్షన్ గరిష్ట మొత్తం కేవలం 1 లక్ష మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ లావాదేవీలను 5 లక్షల దాకా పొడిగించారు. ఈ పెరిగిన పరిమితి నిర్ధిష్ట ఫీల్డ్ లో వారికి మాత్రమే అని తెలుస్తుంది.
5 లక్షల యుపిఐ చెల్లింపు పరిమితి కింది వర్గాలకు మాత్రమే ఇస్తారు. అందులో పన్ను చెల్లింపులు, విద్యా సంస్థల పేమెంట్స్, ఐ.పి.ఓ, హాస్పిటల్ బిల్లులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిటైల్ ట్రాన్సాక్షన్ సిస్టం ఇలాంటి కేటగిరిల్లో యు.పి.ఐ సిస్టం అధిక విలువ లావాదేవీలు చేసే అవకాశం ఇస్తున్నారు.
UPI Transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..!
ఈ మార్పుల ద్వారా ఎంతోమంది వినియోగదారులకు యు.పి.ఐ లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. ఇండియాను నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగ మార్చాలనే మోడీ ప్రభుత్వ లక్ష్యానికి ఇవి దోహదం చేస్తాయని చెప్పొచ్చు. ఐతే పెద్ద మొత్తం లో డిజిటల్ పేమెంట్స్ కాబట్టి అవతల వ్యక్తి యొక్క నెంబర్ కానీ డీటైల్స్ కానీ అన్నీ కరెక్ట్ గా ఉండేట్లు చూసుకోవాలి లేదంటే పొరపాటు జరిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా సరే చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.