iPhone 13 Smart Phone : ఫ్లిప్ కార్ట్ లో అదిరి పోయే ఆఫర్.. భారీ తగ్గింపుతో ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్…!
iPhone 13 Smart Phone : ఈ సంవత్సరం టెక్ దిగ్గజం అయిన ఆపిల్ సంస్థ కొత్త సిరీస్ ఐఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాత మోడల్ ఐఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. అయితే ఐఫోన్ వాడాలనేది చాలామందికి ఒక కలగా ఉంటుంది. అయితే దీనిని ధర ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేయలేని వారు ఇప్పుడు ఐఫోన్ 13ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లో అదిరే ఫీచర్లు ఉన్నాయి. పండుగ సీజన్లో వీటి ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఐఫోన్ 13 పై బంపర్ ఆఫర్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ 13 పై భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తుంది.
ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ దీపావళి ఫెస్టివల్ లో ఈ మోడల్ 45,000 కంటే తక్కువ ధరకే అందించింది. ఇప్పుడు ఈ ఫోను 50 వేల లోపే ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 69,990 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని ధర ప్రస్తుతం తగ్గింది. ఈ మోడల్ పై 4000 డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటిస్తుంది ఫ్లిప్కార్ట్. అంటే ఐఫోన్ 13 ధర 65,990 కి తగ్గుతుంది. దీనిపై ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్ అందుబాటులో లేదు కానీ ఎక్సైజ్ ఆఫర్ తో మరింత తగ్గుతుంది. ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 13 పై 17,500 ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తుంది. పాత ఫోను ఎక్స్చేంజ్ చేసుకొని గరిష్ట విలువ పొందితే ఐఫోన్ 13 ధర 48,500కి తగ్గుతుంది.
iPhone 13 Smartphone with huge discount on Flip Flipkart
అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత స్మార్ట్ ఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. అయితే పాత ఐఫోన్ ఫ్లాగ్ షిప్ సామ్సంగ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసే వినియోగదారులు ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు. ఆఫర్లన్నింటిని కలిపితే 50వేల లోపు ధరకే ఐఫోన్ 13ని సొంతం చేసుకోవచ్చు. లేటెస్ట్ ఆపిల్ సిరీస్లో A16, A15 చిప్స్ సెట్స్ ఉన్నాయి. ఐఫోన్ 13 లో కూడా A15 చిప్ సెట్ ఉంది. కెమెరా క్వాలిటీ పర్ఫామెన్స్ డిజైన్, బ్యాటరీ ఇలా అన్ని విషయాల్లో ఐఫోన్ 14 కు ఏ మాత్రం తీసిపోదు. కొత్త ప్రీమియం ఫోన్ లకు అప్గ్రేడ్ కావాలనుకునేవారు ఫ్లిప్కార్ట్ అందిస్తున్న తాజా ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
