Jio : చైనా కంపెనీలనే బీట్ చేసిన జియా.. ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌లో స‌రికొత్త రికార్డ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio : చైనా కంపెనీలనే బీట్ చేసిన జియా.. ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌లో స‌రికొత్త రికార్డ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Jio : చైనా కంపెనీలనే బీట్ చేసిన జియా.. ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌లో స‌రికొత్త రికార్డ్..!

Jio : ప్రముఖ టెలికాం సంస్థ జియో రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ స‌రికొత్త రికార్డ్‌లు న‌మోదు చేస్తుంది. సాధార‌ణంగా ఓ వ్య‌వ‌స్థ స‌క్సెస్ కావాలి అంటే ప్ర‌జ‌ల స‌పోర్ట్ త‌ప్ప‌నిస‌రి కావాలి. ఆర్ధిక విజయాల్లో కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. రిలయన్స్ జియో విషయంలో కూడా అదే జరిగింది. ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జియో బాటలోనే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు కూడా టారిఫ్ ధరలను పెంచేశాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు వేరే నెట్‌వ‌ర్క్‌కి కూడా మారారు.
చైనా కంపెనీల‌కి ధీటుగా..

అయిన‌ప్పటికీ జియో ఇప్పుడు స‌రికొత్త రికార్డ్ సాధించింది. ఆ కంపెనీ సాధించిన స‌రికొత్త రికార్డ్‌తో చైనా కంపెనీల‌ని సైతం వెన‌క్కి నెట్టింది. జియో వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల ప్రకారం.. జియో డేటా వినియోగం మొత్తం 4400 కోట్ల జీబీ దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ. ఈ గణాంకాల ప్రకారం.. యూజర్లు ప్రతి రోజూ ఒక జీబీ కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారు. ఇక 5జీ డేటా ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 13 కోట్లకు చేరిందని జియో వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 4జీ ప్లాన్ రీఛార్జ్ తో అర్హత కలిగిన వినియోగదారులు 5జీ డేటాను వినియోగించుకుంటున్నారు. దీన్ని బట్టి 5జీ డేటా వాడుకునేవారి శాఖ సంఖ్య బాగా పెరిగిందని తెలుస్తోంది.

Jio చైనా కంపెనీలనే బీట్ చేసిన జియా ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌లో స‌రికొత్త రికార్డ్

Jio : చైనా కంపెనీలనే బీట్ చేసిన జియా.. ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌లో స‌రికొత్త రికార్డ్..!

ప్రస్తుతం జియోకి 49 కోట్ల కంటే ఎక్కువ వినియోగదారులు ఉన్నార‌ని స‌మాచారం. జియో డేటా వినియోగించుకునే యూజర్ల సంఖ్య మాత్రమే కాదు.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ ని వినియోగించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు జియో ఎయిర్ ఫైబర్ సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. జూన్ త్రైమాసికంలో వాయిస్ కాలింగ్ విషయంలో కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇప్పుడు రికార్డు స్థాయి 1.42 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది. మొత్తానికి జియో సాధించిన ఈ రికార్డ్ వెన‌క క‌స్ట‌మ‌ర్ల కృషి ఉందని అర్ధ‌మ‌వుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది