Jio laptop : మార్కెట్లోకి వచ్చిన జియో ల్యాప్ టాప్… కానీ అది వారికి మాత్రమేనట…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio laptop : మార్కెట్లోకి వచ్చిన జియో ల్యాప్ టాప్… కానీ అది వారికి మాత్రమేనట…!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,6:30 pm

Jio laptop : ఎప్పటినుంచో రిలయన్స్ జియో నుంచి ల్యాప్ టాప్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో మొదటి నుంచి లాప్ టాప్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధర, ఫీచర్ల గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ కంపెనీ తన తొలి లాప్టాప్ ను రిలీజ్ చేసింది. అయితే ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. గవర్నమెంట్ ఇ మార్కెట్ ప్లేస్ పోర్టల్ లో ప్రస్తుతానికి దీన్ని అమ్మకానికి ఉంచారు. సామాన్యులకు ఈ దీపావళికి ఈ ల్యాప్ టాప్ ను రిలీజ్ చేయనున్నారు. జీఈఎం పోర్టల్ లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ ల్యాప్ టాప్ ను నెట్ బుక్ గా పేర్కొన్నారు.

దీని ధర 19,500 గా నిర్ణయించారు. ఈ జియో ల్యాప్ టాప్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 అక్టాకోర్ ప్రాసెసర్ ఇస్తున్నారు. జియో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ల్యాప్ టాప్ పనిచేస్తుంది. 2జీబీ ఎల్ పీడీడీఆర్ 4X ర్యామ్ ఇస్తున్నారు. 11.6 అంగుళాల హెచ్డి ఎల్ఈడి బ్యాక్ లిట్ యాంటీ గేర్ డిస్ప్లే తో ఈ ల్యాప్ టాప్ ను తీసుకొస్తున్నారు. 1366 × 768 పిక్సెల్ రిజల్యూషన్ తో డిస్ప్లే అందిస్తున్నారు. యూఎస్బీ 2.0 పోర్ట్, యూఎస్ బీ 3.0, హెచ్ డీఎంఐ పోర్టులు ఇస్తున్నారు. యూఎస్ బీ టైప్ సి పోర్ట్ లేదు. వైఫై 802.11ac కి ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2, 4జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీతో ఈ ల్యాప్ టాప్ ను తీసుకొస్తున్నారు.

Jio reliance released first laptop

Jio reliance released first laptop

డ్యూయల్ ఇంటర్నల్ స్పీకర్స్ డ్యూయల్ మైక్రోఫోన్స్ స్టాండర్డ్ కీబోర్డ్, మల్టీ గెశ్చర్ సపోర్ట్ కలిగిన టచ్ పాడ్ ఇస్తున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం లేదు. ఇంతలో అమర్చిన బ్యాటరీ 6.1 నుంచి 8 గంటల వరకు బ్యాక్అప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 10 ల్యాప్ టాప్ లు మాత్రమే అమ్మకానికి ఉన్నట్లు పోర్టల్ ద్వారా తెలుస్తుంది. అది కూడా కేవలం మహారాష్ట్రకు మాత్రమే డెలివరీలు ఇస్తున్నారు. సాధారణ ప్రజలకు విడుదల చేసే ల్యాప్ టాప్ ధర కూడా ఇంతే ఉంటుందా లేక వేరేలా ఉంటుందో అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ల్యాప్ టాప్ ముదురు నీల రంగులో మాత్రమే పోర్టల్ లో కనిపిస్తుంది. వేరే రంగులో కనిపిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది