Jio Users : వినియోగదారులను ఆకర్షించడానికి Jo జియో, airtel ఎయిర్‌టెల్ , వొడాఫోన్ ఐడియాలాంటి టెలికాం కంపెనీలు పోటీ పడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కంపెనీలు అమాంతం ధరలు పెంచుతుండగా, మరి కొన్ని మాత్రం తగ్గిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని BRS బీఎస్ఎన్ఎల్ అయితే ఇంతకముందు కన్నా చాలా దూకుడుగా ఉంది. అయితే బీఎస్ఎన్ఎల్ తాకిడిని తట్టుకునేందుకు జియో కూడా ఆఫర్స్ తగ్గిస్తూ వస్తుంది. కాని మధ్య మధ్యలో మాత్రం కొన్ని ప్లాన్స్ ధరలు పెంచేస్తుంది. గతంలో రూ.199కే లభించే చౌకైన ప్లాన్ ధరను అమాంతం పెంచేసింది. ఇకపై ఈ ప్లాన్ కోసం మీరు ఎక్స్‌ట్రాగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
జనవరి 23వ తేదీ నుంచి ఈ ప్లాన్ ధర రూ.299కి చేరుకుంటుంది. గతేడాది జులైలోనూ జియో Jio చాలా ప్లాన్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. మునుపటిలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, 25GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఫ్రీ SMSలు, ఉచిత నేషనల్ రోమింగ్ వంటి సేవలు యథావిధిగా కొనసాగుతాయి కాని ఇప్పుడు ఆ ప్లాన్ కోసం వంద రూపాయలు ఎక్స్‌ట్రా వెచ్చించాల్సి ఉంటుంది. ఇక జియో వినియోగదారులకి అనుగుణంగా పలు ప్లాన్స్ ఆఫర్ చేస్తుంది. రిలయన్స్ జియో రూ.2025 ప్రీపెయిడ్ ప్లాన్‌తో కంపెనీ ప్రతిరోజూ 2.5 GB హై స్పీడ్ డేటా, లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 మెసేజ్‌లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 200 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. 2.5 GB హై స్పీడ్ డేటా ప్రకారం, ఈ ప్లాన్ మీకు మొత్తం 500 GB హై స్పీడ్ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.
బడ్జెట్ యూజర్ల కోసం జియో మరో అదిరిపోయే ప్లాన్‌ను అందిస్తోంది. అదే రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. అలాగే, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో సినిమా ప్రీమియం మినహా ఇతర జియో యాప్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. సాధారణ కనెక్టివిటీ, తక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Actress : ఇటీవలి కాలంలో చాలా మంది లైంగిక దాడుల గురించి నిర్భయంగా మాట్లాడుతూ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.…
Venu Swamy : ఇటీవల వేణు స్వామి సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. naga chaitanya నాగ చైతన్య, శోభిత…
Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది. అయితే పెన్షన్లు…
Maadhavi Latha : రెండు రోజులుగా నటి, బీజేపీ BJP నాయకురాలు మాధవీ లత Maadhavi Latha వార్తలలో నిలుస్తుండడం…
Nirmal : వైద్యుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ Anganwadi teacher మృతిచెందినట్లుగా సమాచారం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రాంటేక్…
Indiramma Atmiya Bharosa : ఈ నెల 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం Telangana Govt ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…
Glass Milk : నిత్యం మనం ఆరోగ్యంగా ఉంటే దానికి మించిన సంపద మరొకటి లేదు. ఆరోగ్యాన్ని పొందాలంటే మంచి…
Kiran Abbavaram : తెలుగు చిత్ర పరిశ్రమకు కిరణ్ అబ్బవరం Kiran Abbavaram కథానాయకుడిగా పరిచయమైన సినిమా రాజా వారు…
This website uses cookies.