Jio Users : జియో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చేసింది ఏంటి.. ఏకంగా అంత పెంచేసారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio Users : జియో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చేసింది ఏంటి.. ఏకంగా అంత పెంచేసారు…!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 January 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Jio Users : జియో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చేసింది ఏంటి.. ఏకంగా అంత పెంచేసారు...!

Jio Users : వినియోగదారులను ఆకర్షించడానికి Jo జియో, airtel ఎయిర్‌టెల్ , వొడాఫోన్ ఐడియాలాంటి టెలికాం కంపెనీలు పోటీ ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కొన్ని కంపెనీలు అమాంతం ధ‌ర‌లు పెంచుతుండ‌గా, మ‌రి కొన్ని మాత్రం త‌గ్గిస్తూ వ‌స్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని BRS బీఎస్ఎన్ఎల్ అయితే ఇంత‌క‌ముందు క‌న్నా చాలా దూకుడుగా ఉంది. అయితే బీఎస్ఎన్ఎల్ తాకిడిని త‌ట్టుకునేందుకు జియో కూడా ఆఫ‌ర్స్ తగ్గిస్తూ వ‌స్తుంది. కాని మ‌ధ్య మ‌ధ్య‌లో మాత్రం కొన్ని ప్లాన్స్ ధ‌ర‌లు పెంచేస్తుంది. గ‌తంలో రూ.199కే లభించే చౌకైన ప్లాన్ ధరను అమాంతం పెంచేసింది. ఇకపై ఈ ప్లాన్ కోసం మీరు ఎక్స్‌ట్రాగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

Jio Users జియో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చేసింది ఏంటి ఏకంగా అంత పెంచేసారు

Jio Users : జియో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చేసింది ఏంటి.. ఏకంగా అంత పెంచేసారు…!

Jio Users ఇలా చేసారేంటి..

జనవరి 23వ తేదీ నుంచి ఈ ప్లాన్ ధర రూ.299కి చేరుకుంటుంది. గతేడాది జులైలోనూ జియో Jio చాలా ప్లాన్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. మునుపటిలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, 25GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఫ్రీ SMSలు, ఉచిత నేషనల్ రోమింగ్ వంటి సేవలు యథావిధిగా కొనసాగుతాయి కాని ఇప్పుడు ఆ ప్లాన్ కోసం వంద రూపాయ‌లు ఎక్స్‌ట్రా వెచ్చించాల్సి ఉంటుంది. ఇక జియో వినియోగ‌దారుల‌కి అనుగుణంగా ప‌లు ప్లాన్స్ ఆఫ‌ర్ చేస్తుంది. రిలయన్స్ జియో రూ.2025 ప్రీపెయిడ్ ప్లాన్‌తో కంపెనీ ప్రతిరోజూ 2.5 GB హై స్పీడ్ డేటా, లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 మెసేజ్‌లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 200 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. 2.5 GB హై స్పీడ్ డేటా ప్రకారం, ఈ ప్లాన్ మీకు మొత్తం 500 GB హై స్పీడ్ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.

బడ్జెట్ యూజర్ల కోసం జియో మరో అదిరిపోయే ప్లాన్‌ను అందిస్తోంది. అదే రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. అలాగే, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో సినిమా ప్రీమియం మినహా ఇతర జియో యాప్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. సాధారణ కనెక్టివిటీ, తక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది