SBI Credit Card Offer : మీకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉందా? రూపాయికే డిస్నీ హాట్‌స్టార్, సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 26 June 2023, 2:00 pm

SBI Credit Card Offer : మీకు ఎస్బీఐలో క్రెడిట్ కార్డు ఉందా? అయితే.. మీకు పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఒక సంవత్సరానికి యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. అవును.. కేవలం ఒక్క రూపాయి కడితే చాలు. మరి ఈ డీల్ ను ఎలా పొందాలో తెలియడం లేదా? దాని కోసం మీరు చేయాల్సింది ఒకటే. మీది ప్రైమ్, వీసా నెట్ వర్క్ క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఈ కార్డులు ఉన్నవాళ్లకు టైమ్స్ ప్రైమ్ మెంబర్ షిప్ లభిస్తుంది. అది కూడా ఒక సంవత్సరానికి. టైమ్స్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ విలువ రూ.1199 గా ఉంది. దానితో పాటు పలు ఇతర ఓటీటీలలో యాక్సెస్ లభిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్ ను ఉచితంగా వీక్షించవచ్చు. గానా ప్లస్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అలాగే.. ఈజీ డిన్నర్, మింత్రా, ఉబెర్, పిజ్జా హల్, స్టార్ బక్స్ లాంటి పలు రకాల ఆఫర్లను పొందొచ్చు.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్లకు ఈ ఆఫర్ ద్వారా ఆగస్టు 31 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కార్డు వెబ్ సైట్ కి వెళ్లి ఈ డీల్ ను సొంతం చేసుకోవచ్చు.

one year disney plus hotstar and sony liv subsciption with sbi card,

one year disney plus hotstar and sony liv subsciption with sbi card,

SBI Credit Card Offer : ఈ ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో

ఎస్బీఐ కార్డు వెబ్ సైట్ కి ముందు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత వీసా ఆఫర్ల పేజ్ కి వెళ్లాలి. అక్కడ టైమ్స్ ప్రైమ్ డీల్ కు ఓకే చేయాలి. అక్కడ క్లెయిమ్ ఆఫర్ కనిపిస్తుంది. అక్కడ ఎస్బీఐ కార్డు ఫస్ట్ 8 నెంబర్లను ఎంటర్ చేయాలి. కార్డు వెరిఫికేషన్ పూర్తయ్యాక.. ఒక్క రూపాయి పే చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. కార్డు వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న డీల్స్ అన్నింటినీ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp