OnePlus : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. అందుకే మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇటీవల వన్ ప్లస్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వచ్చింది. లో బడ్జెట్ ఫోన్ లను ఈ మధ్యనే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ వన్ ప్లస్ కంపెనీ ప్రీమియం ఫోన్ ను తీసుకొచ్చింది. వన్ ప్లస్ 10 ఆర్ పేరుతో రిలీజ్ అయిన ఈ ఫోన్ భారత్లో తాజాగా అందుబాటులోకి వచ్చింది. 5జీ నెట్వర్క్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో బెస్ట్ ఫీచర్లను తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
వన్ ప్లస్ 10ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమన్ సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇందులో 6.7 ఇంచుల ఫుల్ హెచ్డి ప్లస్ అమో ఎల్ఇడి డిస్ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెడ్జ్ తో ఉండడంతో క్లారిటీ బాగా వస్తుంది. ఇక స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం 2.5డీ కర్వర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ 5జీ, 4జీ ఎల్టీటీఈ వైఫై 6 బ్లూటూత్ వీ5.2, జిపిఎస్/ఏ-జిపిఎస్, ఎన్ ఎఫ్ సి, యుఎస్ బి, టైప్ సి కోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 38,999 గా ఉంది. అయితే ప్రస్తుతం ఆఫర్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను 32,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎస్బిఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 1500 తగ్గింపు ధర లభిస్తుంది. అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ ఆఫర్ లభిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.