Paytm : తమ వ్యాపార భాగస్వాములకు Paytm హెల్త్ సాథీ.. తక్కువ ఖర్చుతో భీమా పొందే ఏర్పాటు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Paytm : తమ వ్యాపార భాగస్వాములకు Paytm హెల్త్ సాథీ.. తక్కువ ఖర్చుతో భీమా పొందే ఏర్పాటు..!

Paytm : One 97 కమ్యూనికేషన్స్లిమిటెడ్ (OCL) అదే అందరికి పేటిఎం గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు ఆరోగ్య భీమా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ ఆరోగ్య భీమా తమ వ్యాపార భాగస్వాముల కోసం ప్రవేశ పెట్టింది. Paytm ఫర్ బిజినెస్ యాప్ లో Paytm హెల్త్ సాథీ ఆరోగ్య భీమా సౌకర్యాన్ని ప్రారంభించింది. వ్యాపార భాగస్వాములకు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ ఉండేలా Paytm హెల్త్ సాథీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ భీమా […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Paytm : తమ వ్యాపార భాగస్వాములకు Paytm హెల్త్ సాథీ.. తక్కువ ఖర్చుతో భీమా పొందే ఏర్పాటు..!

Paytm : One 97 కమ్యూనికేషన్స్లిమిటెడ్ (OCL) అదే అందరికి పేటిఎం గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు ఆరోగ్య భీమా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ ఆరోగ్య భీమా తమ వ్యాపార భాగస్వాముల కోసం ప్రవేశ పెట్టింది. Paytm ఫర్ బిజినెస్ యాప్ లో Paytm హెల్త్ సాథీ ఆరోగ్య భీమా సౌకర్యాన్ని ప్రారంభించింది. వ్యాపార భాగస్వాములకు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ ఉండేలా Paytm హెల్త్ సాథీ ప్రణాళిక సిద్ధం చేసింది.

ఈ భీమా వల్ల Paytm వ్యాపారులకు సురక్షిత ఆరోగ్య భీమా వారికి అందుబాటులో ఉండే కవరేజిని ఇస్తుంది. అంతేకాదు వారి భాగస్వాములను బల పరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కేవలం నెలవారీ తక్కువ ఛార్జితో ఈ భీమా Paytm వ్యాపారులకు ఇస్తుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ కేవలం 35 రూపాయాలు మాత్రమే ఈ భీమా వారికి అందిస్తుంది.

Paytm హెల్త్ సాథీలో ఇవి కూడా

ఈ Paytm హెల్త్ సాథీ గురించి Paytm ప్రతినిధి మాట్లాడుతూ ఈ భీమా తమ వ్యాపార భాగస్వాముల శ్రేయస్సు కోసం మా అంకిత భావం తెలియచేస్తుందని అన్నారు. ప్రస్తుతం నెల వారి సబ్ స్క్రిప్షన్ 35 రూపాయలతో ప్రారంభించింది. Paytm హెల్త్ సాథీతో అపరిమిత డాక్టర్ టెలి కన్సల్ టేషన్, ఇన్ పర్సన్ డాక్టర్ విజిట్ సేవలను కూడా అందిస్తుంది.

Paytm తమ వ్యాపార భాగస్వాములకు Paytm హెల్త్ సాథీ తక్కువ ఖర్చుతో భీమా పొందే ఏర్పాటు

Paytm : తమ వ్యాపార భాగస్వాములకు Paytm హెల్త్ సాథీ.. తక్కువ ఖర్చుతో భీమా పొందే ఏర్పాటు..!

న్యాచురల్ రిస్క్ టైమ్ లో ఆసరాగా కూడా ఉండేలా ఈ భీమా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలు ఏవైనా వరదలు, అగ్ని ప్రమాదం ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యాపారం నష్ట పొతే వారికి ఆదాయ రక్షణ కవరేజి కూడా భీమా దారులకు అందించే ఏర్పాట్లు చేసింది Paytm. ఇవే కాకుండా ఫార్మసీలో డిస్కౌంట్లు, డయాగ్నస్టిక్ టెస్ట్ లతో మరికొన్ని అదనపు ప్రయోజనాలు అందిస్తుంది. క్లయిమ్ ప్రక్రియ కూడా కేవలం యాప్ లోనే చేసేలా సౌకర్యం. Paytm హెల్త్ సాథీ పైలట్ మే లో మొదలైంది. ఇప్పటికే 3000 మంది వ్యాపార భాగస్వాములు ఈ భీమా ప్లాన్ తీసుకున్నారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది