Paytm PhonePe UPI : మీ ఫోన్ పోయిందా..? పేటీఎం, ఫోన్‌పే UPI ID ఎలా బ్లాక్ చేయాలి?
ప్రధానాంశాలు:
Paytm PhonePe UPI : మీ ఫోన్ పోయిందా..? పేటీఎం, ఫోన్‌పే UPI ID ఎలా బ్లాక్ చేయాలి?
Paytm PhonePe UPI : ప్రస్తుతం ఎక్కడ చూడు ఫోన్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. దాదాపు ప్రతి ఒక్కరూ UPI పేమెంట్ యాప్‌లు అయిన పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్ పోగొట్టుకున్నప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు, అందులోని బ్యాంకింగ్ యాప్‌లు, UPI ఖాతాలు ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో మీ వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని రక్షించడానికి, ఖాతాలను తక్షణమే బ్లాక్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియను సులభంగా నిర్వహించుకోవడానికి పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

Paytm PhonePe UPI : మీ ఫోన్ పోయిందా..? పేటీఎం, ఫోన్‌పే UPI ID ఎలా బ్లాక్ చేయాలి?
Paytm PhonePe UPI పేటీఎం, ఫోన్‌పే UPI ID ఎలా బ్లాక్ చేయాలి?
మీ పేటీఎం ఖాతాను రక్షించుకోవడానికి ముందుగా మరొక ఫోన్‌లో Paytm యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, మీ ఖాతాలో లాగిన్ అవ్వాలి. తరువాత, “Manage Accounts on All Devices” సెక్షన్‌లోకి వెళ్లి, అన్ని పరికరాల నుండి లాగ్ అవుట్ అవ్వాలి. మరింత భద్రత కోసం పేటీఎం కస్టమర్ కేర్ 01204456456 నంబర్‌కు కాల్ చేసి, మీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయమని అభ్యర్థించవచ్చు. అలాగే, PhonePe ఖాతా బ్లాక్ చేయాలంటే, 02268727374 లేదా 08068727374 నంబర్‌కు కాల్ చేసి, మీ మొబైల్ నంబర్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. OTP ధృవీకరణ తర్వాత, మీ UPI IDను సురక్షితంగా బ్లాక్ చేయవచ్చు.
Paytm PhonePe UPI గూగుల్ పే ఖాతా భద్రత ఎలా కాపాడుకోవాలి?
Google Pay UPI ID ని బ్లాక్ చేయాలంటే, 18004190157 నంబర్‌కు కాల్ చేసి, ఖాతాను తక్షణమే నిలిపివేయాల్సిందిగా గూగుల్ కస్టమర్ కేర్‌కు సమాచారం ఇవ్వాలి. అదనంగా, Google Find My Device ద్వారా మీ ఫోన్‌లో ఉన్న డేటాను రిమోట్‌గా తొలగించుకోవచ్చు. ఈ విధంగా, మీ ఫోన్ దొంగిలించబడినా లేదా పోయినా, అందులోని బ్యాంకింగ్ యాప్‌లు ఎవరి చేతిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఫోన్ పోయిన వెంటనే ఈ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది, లేదంటే మీ ఖాతా నుంచి అప్రమత్తం లేకుండా లావాదేవీలు జరగవచ్చు.