RBI : రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..!
RBI : దేశంలో ప్రజలకు చిన్న నోట్ల లభ్యత పెంచేందుకు Reserve Bank of India రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 మరియు రూ.200 నోట్ల సరఫరాను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు (WLAO) ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ విడుదల చేస్తూ, ఏటీఎంల ద్వారా వీటి పంపిణీని పెంచాలని ఆర్‌బీఐ స్పష్టంగా తెలిపింది. ప్రజలు తరచుగా ఉపయోగించే డినామినేషన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
RBI : రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..!
సెప్టెంబర్ 30, 2025 నాటికి 75 శాతం ఏటీఎంలు కనీసం ఒక క్యాసెట్ ద్వారా రూ.100 లేదా రూ.200 నోట్లను అందించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా మార్చి 31, 2026 నాటికి ఈ సంఖ్యను 90 శాతానికి పెంచాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రజలకు చిన్న నోట్ల లభ్యత మెరుగుపడుతుంది, నగదు లావాదేవీలు సౌకర్యంగా జరుగుతాయి. ATMల నిర్వహణలో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం బ్యాంకులకు తప్పనిసరిగా మారింది.
ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఉండనుంది. చిన్న వ్యాపారాలు, సాధారణ వినియోగదారులు తరచుగా చిన్న నోట్లు అవసరం పడుతారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ATMల ద్వారా రూ.100, రూ.200 నోట్ల అందుబాటును పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.