RBI : రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RBI : రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  RBI : రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..!

RBI  : దేశంలో ప్రజలకు చిన్న నోట్ల లభ్యత పెంచేందుకు Reserve Bank of India రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 మరియు రూ.200 నోట్ల సరఫరాను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు (WLAO) ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ విడుదల చేస్తూ, ఏటీఎంల ద్వారా వీటి పంపిణీని పెంచాలని ఆర్‌బీఐ స్పష్టంగా తెలిపింది. ప్రజలు తరచుగా ఉపయోగించే డినామినేషన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

RBI రూ100 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం

RBI : రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..!

RBI : ATM లలో ఆ నోట్లు ఖచ్చితంగా ఉండాల్సిందే – బ్యాంకులకు RBI హెచ్చరిక

సెప్టెంబర్ 30, 2025 నాటికి 75 శాతం ఏటీఎంలు కనీసం ఒక క్యాసెట్ ద్వారా రూ.100 లేదా రూ.200 నోట్లను అందించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా మార్చి 31, 2026 నాటికి ఈ సంఖ్యను 90 శాతానికి పెంచాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రజలకు చిన్న నోట్ల లభ్యత మెరుగుపడుతుంది, నగదు లావాదేవీలు సౌకర్యంగా జరుగుతాయి. ATMల నిర్వహణలో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం బ్యాంకులకు తప్పనిసరిగా మారింది.

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఉండనుంది. చిన్న వ్యాపారాలు, సాధారణ వినియోగదారులు తరచుగా చిన్న నోట్లు అవసరం పడుతారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ATMల ద్వారా రూ.100, రూ.200 నోట్ల అందుబాటును పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది