Redmi launches 5G smartphone With Super Features
Redmi 5G : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవడం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే పర్స్ అయినా మర్చిపోతారేమో కానీ మొబైల్ మాత్రం మర్చిపోరు. ఎందుకంటే అంతలా అందరి కి మొబైల్ అనేది ఒక వ్యసనంలా మారిపోయింది. సెల్ ఫోన్ లేనిదే జీవితం గడిచేటట్లు లేదు. ఫోన్లో నెట్ ఉంటే చాలు. ఇంట్లో కూర్చొని అన్ని పనులను ఫోన్ల ద్వారానే చేసుకుంటున్నారు. ఉదాహరణకు షాపింగ్, కరెంట్ బిల్లు కట్టడం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇంట్లో కూర్చుని ఫోన్ల ద్వారా ఇస్తున్నారు. ఇంట్లో నిత్యవసర వస్తువులను కూడా ఫోన్ ల ద్వారానే ఇంటికి తెప్పించుకుంటున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సామాన్యులు కొనగలిగే ధరలో స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది అవసరం కాబట్టి వివిధ రకాల ఫోన్లను కొన్ని ఫీచర్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు దేశంలో 5జీ నెట్వర్క్ రాబోతుంది. దీంతో 5జి నెట్వర్క్ ను సపోర్ట్ చేసే 5జి స్మార్ట్ ఫోన్లు విడుదల చేసేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ మీ 11 ప్రైమ్ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ 4జిబి ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ధర 13, 999 గా ఉంది. అలాగే 6జిబి ర్యామ్ + 128 జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది.
Redmi launches 5G smartphone With Super Features
రెడ్ మీ 11 ప్రైమ్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 సిస్టం ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో ఆక్టా కోర్ మీడియా టెక్ డైమన్సిటీ 700soc చిప్ ను ఇచ్చారు. అలాగే 18 వాట్స్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్లో 50 మెగా ఫిక్స్ రెయిర్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఐపీ52 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ప్రత్యేకతలు ఉన్నాయి.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.