Redmi Note 14 pro : వైరల్ అవుతున్న రెడ్ మీ నోట్ 14 ప్రో… ఫ్యూచర్స్ అదుర్స్…లాంచింగ్ ఎప్పుడంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2024,6:00 pm

Redmi Note 14 pro : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది విపరీతంగా పెరుగుతుంది. అయితే అమెరికా చైనా తర్వాత మన భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం అధికంగా ఉందని కొన్ని సర్వేలలో వెళ్లడైంది. ఈ నేపథ్యంలోనే కొన్ని స్మార్ట్ ఫోన్స్ కంపెనీలు తమ ఫోన్ లను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విడుదల చేసి తర్వాత భారత్ లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలలో ఒకటైనటువంటి ఎమ్ఐ సరికొత్త మోడల్స్ ను లాంచ్ చేస్తూ వస్తుంది. అయితే ఈ కంపెనీ ఇప్పటికే భారత దేశంలో రెడ్మి నోట్ 13 సిరీస్ ను విడుదల చేయగా ఇక ఇప్పుడు రెడ్ మీ నోట్ 14 రిలీజ్ ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ తరుణంలోనే రెడ్ మీ నోట్ 14 సిరీస్ కు సంబంధించిన ఫోన్ యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Redmi Note 14 pro రెడ్ మీ నోట్ 14 ఫ్యూచర్స్…

రెడ్మీ నోట్ 14 ఫోన్ 50 మెగా ఫిక్సలతో పెద్ద ప్రైమరీ సెన్సార్ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ వెనకవైపు చూసినట్లయితే ఫోటో కెమెరా లేదని చెబుతున్నారు. అలాగే రెడ్ మీ నోట్ 13 ప్రో మాదిరిగా ,ఈ ఫోన్ మధ్యలో హోల్ పంచ్ కటౌట్ తో 1.5 కే రిజల్యూషన్ డిస్ ప్లే ను అందిస్తున్నారు. అయితే ఈ డిస్ ప్లే డ్యూయల్ మైక్రో కార్వ్డ్ స్క్రీన్ అని తెలుస్తోంది. అయితే రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో వస్తుంది. అదేవిధంగా పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో అందుబాటులో ఉంటుంది.

Redmi Note 14 pro : వైరల్ అవుతున్న రెడ్ మీ నోట్ 14 ప్రో... ఫ్యూచర్స్ అదుర్స్...లాంచింగ్ ఎప్పుడంటే...!

Redmi Note 14 pro : వైరల్ అవుతున్న రెడ్ మీ నోట్ 14 ప్రో… ఫ్యూచర్స్ అదుర్స్…లాంచింగ్ ఎప్పుడంటే…!

అయితే ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన రెడ్ మీ నోట్ 13 ఫోన్ రూ.25,999 మార్కెట్లోకి రాగ వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ ఫోన్ 6.67 అంగుళాలు 1.5 కే ఏమో ఎల్ఈడి స్క్రీన్ తో రావడం జరిగింది . అలాగే ఈ ఫోన్ 12gb ర్యామ్ స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 2 చిప్ ద్వారా పనిచేస్తుంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి