Tax Payers : ట్యాక్స్ పేయర్స్‌కి బంపర్ ఆఫర్ ప్రకటించినకేంద్రం
ప్రధానాంశాలు:
Tax Payers : ట్యాక్స్ పేయర్స్‌కి బంపర్ ఆఫర్ ప్రకటించినకేంద్రం
Tax Payers : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పన్ను రిటర్న్ విషయంపై గుడ్ న్యూస్ అందించింది. ఐటీఆర్ ఫైలింగ్స్ గడువును పొడిగించింది. సాధారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం విధించే గడువు జూలై 31 కాగా, ఈ ఏడాది కూడా ఈ గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు సీబీడీటీ తెలియజేయడంతో ట్యాక్స్ పేయర్స్ సంతోషంలో ఉన్నారు.

Tax Payers : ట్యాక్స్ పేయర్స్‌కి బంపర్ ఆఫర్ ప్రకటించినకేంద్రం
Tax Payers : గుడ్ న్యూస్..
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ లన్నీ గడువులోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇదే తొలి పొడిగింపు. మున్ముందు మళ్లీ ఉండకపోవచ్చు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన దరఖాస్తుల్లో గణనీయమైన సవరణలు చేస్తూ… ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీనికి అనుగుణంగా సిస్టమ్ డెవలప్ చేసింది. ఫలితంగా- ఈ ప్రాసెస్ అవసరాలకు అనుగుణంగా ఐటీఆర్ ఫైలింగ్స్ లో కొంత సమయం తీసుకుంటుంది. ఐటీఆర్ ఫైలింగ్స్ లల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి గడువును పొడిగించినట్లు సీబీడీటీ వెల్లడించింది.
సాధారణంగా ముగియాల్సిన గడువు కంటే రెండున్నర నెలల సమయం అదనంగా ఇచ్చినందున ఐటీ ఫైలింగ్స్ సజావుగా సాగుతాయని సీబీడీటీ భావిస్తోంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందకముందే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీబీడీటీ తీసుకున్న నిర్ణయం పట్ల ట్యాక్స్ పేయర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.