Jio – Telegram : తిరుగులేని జియోకి నమ్మలేని షాక్ ఇచ్చిన టెలిగ్రాం

Authored By Breaking News 2 | The Telugu News | Published on: June 4, 2023, 4:38 pm

Jio – Telegram : ఇదంతా టెక్నాలజీయుగం. ఇప్పుడు పాటలు వినాలంటే క్షణం పని. అరచేతిలోనే అన్నీ ఉంటాయి. కానీ.. ఒకప్పుడు రేడియోలు, టేప్ రికార్డర్లు ఉండేవి. వీసీఆర్ లు ఉండేవి. క్యాసెట్లు వేసుకొని పాటలు వినేవాళ్లం. అప్పట్లో సినిమాలు కూడా సీడీలు, డీవీడీల రూపంలో ఉండేవి. సినిమాలు పైరసీ చేసి సీడీలు, డీవీడీలలో భద్రపరిచేవారు. అప్పట్లో అదే పైరసీ. రూపాయి ఖర్చు లేకుండా అప్పట్లో డీవీడీలను ఇంట్లో వేసుకొని కొత్త సినిమాలను ఎంజాయ్ చేసేవాళ్లం.కాకపోతే కొత్త సినిమాలు రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత డీవీడీలలోకి వచ్చేవి. అప్పట్లో సినిమా పైరసీ అనేది అంత ఈజీ కాదు. కానీ.. ఇది డిజిటల్ యుగం కదా.

సినిమా రిలీజ్ కాకముందే కొన్నిసార్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవుతోంది. వేల కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ అయిన క్షణాల్లోనే ఆన్ లైన్ లోకి పైరసీ అవుతున్నాయి. ఇప్పుడు సీడీలు, డీవీడీలు లేవు. నేరుగా ఆన్ లైన్ లోకి ఎక్కడమే.ఇప్పుడు ఈ పైరసీ బెడద ఓటీటీ ప్లాట్ ఫామ్ లకూ అంటుకుంది. అది ఏ ఓటీటీ అయినా సరే.. ఏ వెబ్ సిరీస్ రిలీజ్ అయినా వెంటనే దాన్ని కూడా పైరసీ చేసేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన అసుర్ అనే వెబ్ సిరీస్ కు కూడా పైరసీ గోల తప్పలేదు.

telegram-gives-big-shock-to-jio

telegram-gives-big-shock-to-jio

Jio – Telegram : ఓటీటీలకూ అంటుకున్న పైరసీ బెడద

జియో సినిమాలో అసుర్ రెండో సీజన్ ను స్ట్రీమింగ్ చేయగా.. ఇంకా అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ కాకముందే.. టెలిగ్రామ్ యాప్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో జియో టీమ్ షాక్ అయింది. వెంటనే అన్ని ఎపిసోడ్లను జియో సినిమాలో విడుదల చేసింది. అసలు.. విడుదలకు ముందే టెలిగ్రామ్ యాప్ లో అవి ఎలా ప్రత్యక్షం అయ్యాయో తెలియక జియోకు దిమ్మతిరిగింది. ఇలా అయితే.. అప్ కమింగ్ సినిమా వాళ్లకు పైరసీ కష్టాలు ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ.. తగ్గేలా లేదు.

Breaking News 2

No bio available for this author.

  1. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  2. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  3. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  4. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  5. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  6. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  7. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp