
telegram-gives-big-shock-to-jio
Jio – Telegram : ఇదంతా టెక్నాలజీయుగం. ఇప్పుడు పాటలు వినాలంటే క్షణం పని. అరచేతిలోనే అన్నీ ఉంటాయి. కానీ.. ఒకప్పుడు రేడియోలు, టేప్ రికార్డర్లు ఉండేవి. వీసీఆర్ లు ఉండేవి. క్యాసెట్లు వేసుకొని పాటలు వినేవాళ్లం. అప్పట్లో సినిమాలు కూడా సీడీలు, డీవీడీల రూపంలో ఉండేవి. సినిమాలు పైరసీ చేసి సీడీలు, డీవీడీలలో భద్రపరిచేవారు. అప్పట్లో అదే పైరసీ. రూపాయి ఖర్చు లేకుండా అప్పట్లో డీవీడీలను ఇంట్లో వేసుకొని కొత్త సినిమాలను ఎంజాయ్ చేసేవాళ్లం.కాకపోతే కొత్త సినిమాలు రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత డీవీడీలలోకి వచ్చేవి. అప్పట్లో సినిమా పైరసీ అనేది అంత ఈజీ కాదు. కానీ.. ఇది డిజిటల్ యుగం కదా.
సినిమా రిలీజ్ కాకముందే కొన్నిసార్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవుతోంది. వేల కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ అయిన క్షణాల్లోనే ఆన్ లైన్ లోకి పైరసీ అవుతున్నాయి. ఇప్పుడు సీడీలు, డీవీడీలు లేవు. నేరుగా ఆన్ లైన్ లోకి ఎక్కడమే.ఇప్పుడు ఈ పైరసీ బెడద ఓటీటీ ప్లాట్ ఫామ్ లకూ అంటుకుంది. అది ఏ ఓటీటీ అయినా సరే.. ఏ వెబ్ సిరీస్ రిలీజ్ అయినా వెంటనే దాన్ని కూడా పైరసీ చేసేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన అసుర్ అనే వెబ్ సిరీస్ కు కూడా పైరసీ గోల తప్పలేదు.
telegram-gives-big-shock-to-jio
జియో సినిమాలో అసుర్ రెండో సీజన్ ను స్ట్రీమింగ్ చేయగా.. ఇంకా అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ కాకముందే.. టెలిగ్రామ్ యాప్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో జియో టీమ్ షాక్ అయింది. వెంటనే అన్ని ఎపిసోడ్లను జియో సినిమాలో విడుదల చేసింది. అసలు.. విడుదలకు ముందే టెలిగ్రామ్ యాప్ లో అవి ఎలా ప్రత్యక్షం అయ్యాయో తెలియక జియోకు దిమ్మతిరిగింది. ఇలా అయితే.. అప్ కమింగ్ సినిమా వాళ్లకు పైరసీ కష్టాలు ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ.. తగ్గేలా లేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.