Honda Shine : అతి తక్కువ ధరకే హోండా షైన్ .. స్కూటీ కంటే చాలా చీప్ ..!!
Honda Shine : మార్కెట్లో హోండా కంపెనీ కి ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే చాలా కంపెనీలు వచ్చాయి కానీ అంతకుముందు బైక్ అంటే హీరో హోండానే. ఆ కంపెనీ మోడల్స్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే కొన్నాళ్లకు వాటికి ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు హోండా కంపెనీ సరికొత్త షైన్ మోడల్ ని తీసుకొచ్చింది. హోండా కంపెనీ ఇండియన్ మార్కెట్లో 100 సీసీ విభాగంలో తమ డిమాండ్ ను పెంచుకునేందుకు సరికొత్త హోండా షైన్ తీసుకొచ్చింది. ఈ షైన్ 100 సీసీ మోడల్ తో ఈ సెగ్మెంట్లో కూడా తమ ఆధిపత్యం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ హోండా షైన్ 100 సిసి మోడల్ 80 వేలకు కొనుగోలు చేయవచ్చాని చెబుతున్నారు. ఈ బైక్ 5 కలర్ వేరియేషన్స్ లో అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ బైక్ స్కూటీ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం స్కూటీల ధరలు బాగా పెరిగిపోయాయి. ఇలాంటి టైంలో హోండా షైన్ 80 వేల ధరకే వస్తుంది. ఇకపోతే హోండా షైన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 98.9 సీసీ సింగిల్ సిలిండర్ తో వస్తుంది. ఈ హోండా షైన్ ఎయిర్ కూల్డ్ మోటార్ తో పనిచేస్తుంది. 8.05 ఎంఎం పవర్ ని రిలీజ్ చేస్తుంది. అందులో నాలుగు స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ డ్యూయల్ రియల్ స్ప్రింగ్ లు, సిబిఎస్ టెక్నాలజీతో ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్రౌండ్ బ్రేక్ సిస్టం ఉంటుంది. ఈ మోడల్ లో ట్యూబ్ ఉండే టైర్లను ఇస్తున్నారు. ట్యూబ్ లెస్ టైర్లతో రావడం లేదు. ఇది లీటర్ కు 60 నుంచి 70 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ లో 5 రకాల వేరియేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో రెడ్, బ్లూ, గ్రీన్, గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ హోండా షైన్ డీలర్లకు చేరుకున్నాయని చెబుతున్నారు. త్వరలోనే అమ్మకాలు కూడా ప్రారంభం అవుతాయని సమాచారం. ఇప్పటికే చాలామంది ఈ హోండా షైన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.