Smart TV : రూ.50వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.18 వేలకే.. త్వరపడండి..!
Smart TV : ఈ రోజుల్లో స్మార్ట్ టీవీ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాకపోతే అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అందులోనూ మధ్యతరగతి వారికి అది ఒక పెద్ద కల అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటిలో స్మార్ట్ టీవీ పెట్టుకుంటే ఆ అందం వేరే విధంగా ఉంటుంది కదా. కానీ మధ్యతరగతి వారు ఓస్మార్ట్ టీవీని కొనాలంటే చాలానే ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇప్పుడు ఓ ఈ కామర్స్ సంస్థ మధ్యతరగతి వారి కలను నిజం చేయడానికి ముందుకు వచ్చింది. సాధారణంగా మధ్యతరగతి వారు ఏదో తక్కువ ధరకు లభించే స్మార్ట్ టీవీలను మాత్రమే కొనుగోలు చేస్తారు.
Smart TV : క్రేజీ ఫీచర్లతో..
అయితే ఇప్పుడు ఆ కంపెనీ ఏకంగా రూ.50 వేల స్మార్ట్ టీవీ మీద బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా ఆ టీవీ మీద రూ.32 వేల వరకు తగ్గింపు ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. మీరు టీవీ కొనాలనే ప్లాన్ లో ఉంటే త్వరపడండి. ఎందుకంటే సాధారణంగా ఇంత ధర ఉండే స్మార్ట్ టీవీ మీద ఇంతటి భారీ తగ్గింపు అయితే ఎన్నడూ ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఉంటుందని చెబుతోంది ఈ కామర్స్ సంస్థ. తక్కువ ధరలోనే క్రేజీ ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీ కావాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వారికి ఈ కంపెనీ పెద్ద గుడ్ న్యూస్ చెప్పిందనే అనుకోవాలి.

Smart TV : రూ.50వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.18 వేలకే.. త్వరపడండి..!
43 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఈ కామర్స్ సంస్థ. ఏకంగా 63 శాతం వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది ఈ కంపెనీ. టీసీఎల్ ఐఫాల్కన్ 43 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, డాల్బే ఆడియో, హెచ్‌డీఆర్ 10 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వాస్తవంగా దీని ధర రూ. 49,999. అయితే ఈ స్మార్ట్ టీవీపై 63 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఇంకేముంది దీని ధర మీద రూ.31500 వరకు ఆదా అవుతోంది. ఆ కారనంగా స్మార్ట్ టీవీ కేవలం రూ.18, 499కే మీరు దక్కించుకోవచ్చు. ఇంతటి భారీ ఆఫర్ ప్రకటించడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. అయితే దీనిపై ఎలాంటి అనుమానాలు వద్దని కంపెనీ చెబుతోంది. మామూలుగానే అన్ని టీవీల లాగే ఇది కూడా బ్రాండెడ్ అని సంస్థ ప్రకటిస్తోంది.