Amazon : ఏ మాత్రం ఆలస్యం చేయకండి.. అమెజాన్‌లో రూ.15వేలకే బెస్ట్ Smart Tv..!
ప్రధానాంశాలు:
Amazon : ఏ మాత్రం ఆలస్యం చేయకండి.. అమెజాన్‌లో రూ.15వేలకే బెస్ట్ Smart Tv..!
Amazon : ఈ మధ్య టీవీలని ఎక్కువగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ టీవీలు చూసేందుకు ఎంతో చక్కగా ఉంటాయి. స్టైలిష్ గా కనిపిస్తాయి. వీటిలో పెద్ద తెర ఉండడం వలన పిక్చర్ కూడా చాలా చక్కని క్లారిటీతో కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ టీవీ కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి సరైన దానిని పిక్ చేసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారమే. అయితే అతి తక్కువ ధరకు అమెజాన్ బెస్ట్ టీవీ అందిస్తుంది.కేవలం రూ. 15,000 కంటే తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. అది కూడా 40 ఇంచెస్ స్మార్ట్ టీవీలు.

Amazon : ఏ మాత్రం ఆలస్యం చేయకండి.. అమెజాన్‌లో రూ.15వేలకే బెస్ట్ Smart Tv..!
Amazon బెస్ట్ టీవీలు ఇవే..
టీసీఎల్ 40 ఇంచెస్ మెటాలిక్ బెజెల్-లెస్ ఫుల్ ఎచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI, 1 USB పోర్ట్‌తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో 1 GB RAM, 8GB ROM ఉంటుంది. ఈ టీవీ 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది.ఇంక గొప్ప విషయం ఏంటంటే ఈ టీవీలో ఇన్‌బిల్ట్‌గా నెట్ ఫ్లిక్స్, అమెజాన్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ టీవీని రూ. 15,990కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఈఎంఐలో రూ. 775కి కొనుగోలు చేయవచ్చు. రూ.1750 వరకు డిస్కౌంట్ అందిస్తే, ఈ టీవీ రూ. 15,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
మరోవైపు కొడాక్ 40 ఇంచెస్ స్పెషల్ ఎడిషన్ సిరీస్ ఫుల్ HD స్మార్ట్ LED టీవీ. ఇందులో 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు ఉన్నాయి. బిల్ట్-ఇన్ వై-ఫై వంటి ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ టీవీలో ఉన్నాయి. ఇందులో 512MB RAM ఉంటుంది. సోని లివ్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5 లాంటి యాప్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ టీవీ ధర రూ. 14,499 కాగా, ఈఎంఐలో రూ. 703కి కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై రూ. 1750 వరకు డిస్కౌంట్ ఉంది. ఈ స్మార్ట్ టీవీ 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 11,999. కాగా,హెడ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 1250 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులోను పలు ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయవచ్చు.