Maruti Suzuki Cars : స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో న్యూ జెన్ మారుతి కార్లు.. వివిధ ర‌కాలు ఆప్ష‌న్స్‌తో త్వ‌ర‌లోనే లాంచ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Maruti Suzuki Cars : స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో న్యూ జెన్ మారుతి కార్లు.. వివిధ ర‌కాలు ఆప్ష‌న్స్‌తో త్వ‌ర‌లోనే లాంచ్

Maruti Suzuki Cars : మారుతి కార్ ఇష్ట ప‌డ‌ని వారు లేరు. స‌రికొత్త ఫీచ‌ర్స్,మంచి మైలేజ్‌తో ఆ కంపెనీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ర‌కం కార్ల‌ని మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తుండ‌డం మనం చూస్తూ ఉన్నాం. డిజైన్ పరంగా పలు మార్పులు చేస్తూ నయా కార్లని మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. కొద్ది నెలల్లో మూడు కొత్త​ కార్లను భారత విపణిలో​ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అవి: మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్​జీ, న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2024,9:30 pm

Maruti Suzuki Cars : మారుతి కార్ ఇష్ట ప‌డ‌ని వారు లేరు. స‌రికొత్త ఫీచ‌ర్స్,మంచి మైలేజ్‌తో ఆ కంపెనీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ర‌కం కార్ల‌ని మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తుండ‌డం మనం చూస్తూ ఉన్నాం. డిజైన్ పరంగా పలు మార్పులు చేస్తూ నయా కార్లని మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. కొద్ది నెలల్లో మూడు కొత్త​ కార్లను భారత విపణిలో​ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అవి: మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్​జీ, న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఈవీఎక్స్​ ఎస్​యూవీ. కాగా వాటి ఫీచ‌ర్స్ చూస్తే..

1. Maruti Suzuki Swift CNG

న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు సీఎన్​జీ ఇప్పుడు సీఎన్‌జీ వ‌ర్షెన్‌లో అందుబాటులోకి రానుంది. ద్వితియార్ధంలో కారుని మ‌న‌దేశంలో లాంచ్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. సీఎన్‌జీ కారు 32 కి.మీ/కిలో మైలేజ్​ ఇస్తుందని సమాచారం. ఇక పెట్రోల్​ వెర్షన్​ కంటే ఈ సీఎన్​జీ ఇంజిన్​తో వస్తున్న కారు ధర రూ.90,000-రూ.95,000 ఎక్కువగా ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే సీఎన్‌జీ వ‌ల‌న పవర్​ ఔట్​పుట్​ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

2. New Gen Maruti Suzuki Dzire : ఈ న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కారును వ‌చ్చే ఏడాది జూలైలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఓ టాక్ వినిపిస్తుంది. డిజైర్ మోడ‌ల్ కార్స్ ఓ రేంజ్‌లో సేల్ అవుతుంటాయి. ఇప్పుడు స‌రికొత్త మోడ‌ల్స్ కూడా మంచి సేల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సన్‌రూఫ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, సన్‌రూఫ్‌ ఫెసిలిటీ పొందిన తొలి సెడాన్ కారుగా న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ నిల‌వ‌డం ఖాయం. కారులో 1.2లీటర్​ Z సిరీస్‌కు చెందిన మూడు సిలిండర్ల Z12E పెట్రోల్ ఇంజిన్ అమ‌ర్చే అవ‌కాశం ఉంది. ఈ ఇంజిన్ 111.7 Nm పీక్​ టార్క్ ప్రొడ్యూస్ చేయ‌నుంది. మాన్యువల్​, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లను జ‌త‌పరుస్తారు. ఇక కొల‌త‌లు అన్నీ కూడా పాత మోడ‌ల్ త‌ర‌హాలో ఉండబోతుంది. ఆటోమేటిక్ HVAC, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారులో ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్, అప్‌గ్రేడ్ చేసిన హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, కొత్త సెట్ బంపర్లు ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవ‌చ్చు

Maruti Suzuki Cars స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో న్యూ జెన్ మారుతి కార్లు వివిధ ర‌కాలు ఆప్ష‌న్స్‌తో త్వ‌ర‌లోనే లాంచ్

Maruti Suzuki Cars : స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో న్యూ జెన్ మారుతి కార్లు.. వివిధ ర‌కాలు ఆప్ష‌న్స్‌తో త్వ‌ర‌లోనే లాంచ్

3. Maruti Suzuki eVX Electric SUV : మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఈ ఏడాది చివ‌రి నాటికి భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్​ చేస్తున్న ఈ కారును, బోర్న్-ఎలక్ట్రిక్ స్కేట్​బోర్డ్ ప్లాట్​ఫామ్​పై నిర్మిస్తున్నారు. 2700mm వీల్‌బేస్‌తో 4.3 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒక ఛార్జ్‌పై 400 కిలో మీటర్ల రేంజ్​తో 48 kWh బ్యాటరీ ఒకటి ఉండ‌గా, 550 కిలో మీటర్ల రేంజ్​ ఇచే 60 kWh బ్యాటరీ మరొకటి ఉంటుంది. ప‌లు కంపెనీల కార్ల‌కి పోటీగా ఈ కారుని విడుద‌ల చేస్తున్నారు. ఇవి ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది