Vivo X90 Pro : అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న వివో కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vivo X90 Pro : అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న వివో కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ?

Vivo X90 Pro : వివో కంపెనీ నుంచి వివో X90 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం చివరిలోపు వస్తుందని భావిస్తున్నారు. వివో X90, X90 ప్రో ఫోన్లు నవంబర్ 8న లాంచ్ అవుతాయని పుకార్లు వినిపిస్తున్నాయి. X90 pro+స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 ని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. ఇది నవంబర్ 15న అధికారికంగా విడుదల కాబోతుంది. V2242A మరియు V2272A మోడల్ నెంబర్స్ కలిగిన వివో ఫోన్లు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 November 2022,9:20 pm

Vivo X90 Pro : వివో కంపెనీ నుంచి వివో X90 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం చివరిలోపు వస్తుందని భావిస్తున్నారు. వివో X90, X90 ప్రో ఫోన్లు నవంబర్ 8న లాంచ్ అవుతాయని పుకార్లు వినిపిస్తున్నాయి. X90 pro+స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 ని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. ఇది నవంబర్ 15న అధికారికంగా విడుదల కాబోతుంది. V2242A మరియు V2272A మోడల్ నెంబర్స్ కలిగిన వివో ఫోన్లు వివో X90, X90 pro+చైనీస్ మార్కెట్లోకి వస్తాయి. నివేదికలో వివో X90 మోడల్ నెంబర్ పై ఎటువంటి సమాచారం లేదు. భారత్ తో సహా ప్రపంచ మార్కెట్లో వివో X90, X90 ప్రో ఫోన్లు V2218, V2219 మోడల్ నెంబర్లు కలిగి ఉంటాయని నివేదిక పేర్కొంది.

వివో X90 స్మార్ట్ ఫోన్ లో 1.5కే అమోలెడ్ స్క్రీన్ 4,700mAh బ్యాటరీ 120w వేగవంతమైన ఛార్జింగ్ ఫీచర్లు కలిగి ఉందని తెలిపింది. ఇందులో సోని IMX8 సిరీస్ కెమెరా కూడా ఉంది మరోవైపు వివో x90 ప్రో+ లో 6.78 ఇంచుల అమోలెడ్ ఎల్ పిటిఓ 120Hz 2K డిస్ప్లే, యుఎఫ్ ఎస్ 4.0 స్టోరేజ్ 80W చార్జింగ్ తో కూడిన 4700 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు మెయిన్ కెమెరా 48 మెగా పిక్స్ సోనీ IMX598 అల్ట్రా వైడ్ లైన్స్ 50 మెగా పిక్సెల్ సోనీ IMX578 పోర్ట్రైట్ లెన్స్ మరియు 3.5x ఆప్టికల్ జూమ్ కు మద్దతుతో ఓమ్ని విజన్ OV64A పెరిస్కోప్ డ్యుమ్ లైన్స్ కలిగి ఉంటుంది. వివో X ఫోల్డ్+5జి ఫోను విడుదల చేసింది.

Vivo X90 Pro new smart phone coming soon on India

Vivo X90 Pro new smart phone coming soon on India

vivo X Fold+స్మార్ట్ ఫోన్ 8.0 అంగుళాల అమోలెడ్ ప్రైమరీ డిస్ప్లే తో వస్తుంది. ఈ ప్రైమరీ 2k సపోర్ట్ 1,916×2, 160 పిక్సెల్ 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు అనేక ఇతర ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.53 అంగుళాల అమొలెడ్ కవర్ డిస్ప్లే అని కలిగి ఉంది. ముఖ్యంగా ఇది 1080×2, 520 పిక్సెల్ మరియు ఫుల్ హెచ్డి ప్లస్ ను అందిస్తుంది. కొత్త వివో X ఫోల్డ్ ప్లస్ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ పోర్ట్రైట్ సెన్సార్ 8 ఎంపీ పెరిస్కోప్ కెమెరా క్వాడ్ కెమెరా సెట్ అప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా ఉంది. వివో X ఫోల్డ్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు 4730mAh బ్యాటరీ ఉంది. వివో స్మార్ట్ ఫోన్ 80w, 50 w వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది