Deep Fake : ప్రస్తుతం ప్రపంచమంతా చర్చిస్తున్న అంశం డీప్ ఫేక్. ఇది ఒక ఏఐ టూల్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఈ టూల్ ను ఉపయోగించి వేరే యువతి బాడీని రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వీడియోలో డ్రెస్ చాలా పొట్టిగా ఉంటుంది. పైన కూడా ఎద మొత్తం కనిపిస్తుంది. అసలు రష్మిక మందన్నా ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఎప్పుడూ కనిపించదు కదా. అసలు.. తను ఇలా ఎందుకు ప్రవర్తించింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కానీ.. అసలు ఆ వీడియోలో ఉన్నది రష్మిక మందన్నా కానే కాదు. అది వేరే యువతి వీడియో. కానీ.. డీప్ ఫేక్ ఏఐ టూల్ ను ఉపయోగించి రష్మిక మందన్నా ఫోటోను యాడ్ చేశారు. దీంతో ఆమె రష్మికలాగానే కనిపించింది. నిజానికి ఇది చాలా డేంజరస్ టూల్. ఈ టూల్ ద్వారా రకరకాలుగా ఫోటోలను మార్ఫింగ్ చేయొచ్చు. దీంతో ప్రస్తుతం ఈ టూల్ గురించి అంతటా చర్చ నడుస్తోంది.
డీప్ ఫేక్ అనే ఏఐ టూల్ ద్వారా ఫోటోలను ఏవిధంగా అయినా మార్చేయొచ్చు. ఉదాహరణకు ఫుల్ డ్రెస్ లో ఉన్నా డ్రెస్ లేనట్టుగా చేయొచ్చు. రకరకాలుగా చేయొచ్చు. ముఖాలు మార్చొచ్చు. ఏదైనా చేయొచ్చు. అసలు అది నకిలీ ఫోటో అని గుర్తుపట్టడం కూడా కష్టం అవుతుంది. అది నిజమైన ఫోటో, నిజమైన వీడియో అన్నట్టుగానే ఉంటుంది. అందుకే.. ఈ డేంజరస్ ఫేక్ ఫోటోలు, వీడియోల నుంచి ఇప్పుడు ఎక్కువగా యువతులకు పెద్ద సమస్యగా మారింది. సోషల్ మీడియాలో మీరు ఎలాంటి ఫోటోలు, వీడియోలు పెట్టినా.. యువతుల ఫోటోలు, వీడియోలు తీసుకొని డీప్ ఫేక్ ఏఐ టూల్ తో ఏదైనా చేయొచ్చు. నిజానికి ఈ డీప్ ఫేక్ అనే కాన్సెప్ట్ 2014 లోనే వచ్చింది. అప్పుడు దీన్ని సింథటిక్ మీడియా అనేవారు. 2017 లో ఈ సింథటిక్ మీడియాను ఉపయోగించి రెడిట్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో డీప్ ఫేక్ పేరుతో మార్ఫింగ్ చేసిన కొన్ని వీడియోలను అప్ లోడ్ చేయడంతో అప్పటి నుంచి దానికి డీప్ ఫేక్ అనే పేరు వచ్చింది.
నిజానికి ఈ టూల్ ను ముందు కామెడీ వీడియోలు చేయడం కోసం, మీమ్స్ కోసం ఉపయోగించేవారు. సినిమాల్లోని కామెడీ సీన్స్ ను డీప్ ఫేక్ టూల్ తో ఎడిట్ చేసేవాళ్లు. ఆ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చేది. దీంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రకరకాల మార్ఫింగ్ లు చేయడం స్టార్ట్ చేశారు. అలా.. డీప్ ఫేక్ ఏఐ టూల్ తో ముఖాలు మార్చేయడం, డ్రెస్సులు లేనట్టుగా చేయడం, అలాంటి ఫోటోలు, వీడియోలకు యాడ్ చేయడం లాంటివి చేశారు క్రిమినల్స్.
తాజాగా.. రష్మిక మందన్నా ముఖాన్ని ఆ టూల్ ఉపయోగించి మార్చేశారు. అందుకే ఇప్పుడు డీప్ ఫేక్ ఏఐ టూల్ చాలా డేంజరస్ గా మారింది. డీప్ ఫేక్ వీడియో ఒకవేళ సోషల్ మీడియాలో కనిపిస్తే.. ఆ వీడియో స్టార్టింగ్ లోనే అంటే ఫస్ట్ సెకండ్, రెండు సెకన్లలోనే తెలిసిపోతుంది. అది నకిలీ వీడియో అని స్పష్టంగా కనిపిస్తుంది. కానీ.. దాన్ని పరీక్షించి చూడాలి. వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే.. పూర్తిగా 100 శాతం అది పర్ ఫెక్ట్ గా కనిపించదు. ముఖంలో కనిపించే హావభావాలు తేడాగా ఉంటాయి. అలాగే.. లిప్ సింక్ కూడా తేడాగా ఉంటుంది. ఒకవేళ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయొచ్చు. అలాగే.. స్టాప్ ఎన్‌సీఐఐ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి వీడియోలను వెంటనే తీసేస్తారు.
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
This website uses cookies.