
Whatsapp : వాట్సప్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి కొత్త ఫీచర్స్
Whatsapp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్.. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మరో అడుగు వేసింది. ఇటీవల iOS యూజర్ల కోసం రెండు కీలక ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్టు సమాచారం. ఫీచర్ ట్రాకింగ్ సంస్థ WABetaInfo అందించిన వివరాల ప్రకారం, ఈ రెండు ఫీచర్లు వాడకదారులకు మరింత సౌకర్యాన్ని కలిగించనున్నాయి.
Whatsapp : వాట్సప్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి కొత్త ఫీచర్స్
ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న మల్టీ అకౌంట్ ఫీచర్, త్వరలో iOS డివైజ్‌లలోకి రానుంది. తాజా iOS బీటా వెర్షన్ 25.19.10.74 లో ఈ ఫీచర్ కనిపించినట్టు WABetaInfo వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా.. ఒకే డివైజ్‌లో ఎక్కువ వాట్సాప్ అకౌంట్లను నిర్వహించవచ్చు.పర్సనల్, బిజినెస్ ఖాతాల మధ్య సులభంగా స్విచ్ చేయవచ్చు. సెట్టింగ్స్‌లోని అకౌంట్ లిస్ట్ ద్వారా ఈ స్విచింగ్ సౌకర్యాన్ని పొందొచ్చు.
ఇది యూజర్లకు ఉద్యోగం, వ్యక్తిగత జీవితం వేర్వేరు అకౌంట్లతో నిర్వహించేందుకు పెద్ద ఉపయోగంగా మారనుంది. ఇంకో ఆసక్తికరమైన ఫీచర్‌గా, డాక్యుమెంట్ స్కాన్ టూల్ ను కూడా వాట్సాప్ పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ iOS యూజర్లకు బీటా వర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకూ రానుంది. థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా, వాట్సాప్ నుంచే డాక్యుమెంట్లను స్కాన్ చేసి PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్లు బీటా వెర్షన్‌లో పరీక్షలు జరుపుకుంటున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.