Aarogyasri : తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
Aarogyasri : తెలంగాణలో ఈ నెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు Aarogyasri నిలిపివేస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా తెలిపాయి. తమ సమస్యలు పరిష్కరించక పోతే జనవరి 10 నుంచి వైద్య సేవల్ని నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఇవోకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాయి. ఆరోగ్యశ్రీతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీమ్ (జేహె చ్ఎస్)లలో కూడా భారీగా బకాయిలు ఉన్నాయని తెలిపాయి.
Aarogyasri : తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
పెండింగ్ బకాయిల వల్ల ఆస్పత్రులు ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్నాయని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల ఆసోసియేషన్ (తానా) పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్యశ్రీ సేవ లను కొనసాగించే పరిస్థితి లేదని స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయని తానా చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 9 నెలల బకాయిలు రూ.672 కోట్లు పెండింగ్‌లో ఉండగా కాంగ్రెస్ వచ్చాక అది మరింత పెరిగిందని చెబుతున్నారు.
గతంలో మొదట బిల్లులు పెట్టిన వారికే మొదట చెల్లింపు (ఫస్ట్ క్లెయిమ్, ఫస్ట్ పేమెంట్) తరహా పద్దతి ఉండేదని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో మొదట ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో ఆస్పత్రులు నడిపే పరిస్థితి లేదని తెలంగాణ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది. ప్రభుత్వం మాత్రం గత వారం కూడా రూ.40 కోట్లు విడుదలైందని, బకాయిలు రూ.400 కోట్లకు మించి ఉండవని చెబుతోంది.
Chayote For Cancer : ఇది చూసి అచ్చం జామ పండులా ఉంది అనుకునేరు...ఇది జామ పండు అస్సలు కాదు.…
Carrots : నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా రెండు క్యారెట్లను తింటూ ఉండాలి. రోజుకు కనీసం రెండు…
Dairy Farm Business : రైతన్న ఆలోచనలు మారాయి. సరికొత్తగా బిజినెస్ అభివృద్ది చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా డైరీ…
Health Benefits of Coffee : మారుతున్న కాలాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తమ అభిరుచులను అలవర్చుకుంటూ ఉన్నారు.…
Jyotisyam : శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు వాటి గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులలోకి…
Rahul Gandhi : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు షాక్ ఇచ్చింది.…
Actor Wife : ప్రముఖ తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తిల విడాకుల కేసు గత కొద్ది…
Manchu Manoj : గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ వివాదాలతో వార్తలలో నిలుస్తున్నారు. మంచు ఫ్యామిలీ ఇష్యూస్ రచ్చగా…
This website uses cookies.