Aarogyasri : తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aarogyasri : తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..?

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2025,12:30 pm

ప్రధానాంశాలు:

  •  Aarogyasri : తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Aarogyasri : తెలంగాణలో ఈ నెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు Aarogyasri నిలిపివేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు చెల్లించకపోవడ‌మే ఇందుకు కార‌ణంగా తెలిపాయి. తమ సమస్యలు పరిష్కరించక పోతే జనవరి 10 నుంచి వైద్య సేవల్ని నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఇవోకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాయి. ఆరోగ్యశ్రీతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీమ్ (జేహె చ్ఎస్)లలో కూడా భారీగా బకాయిలు ఉన్నాయని తెలిపాయి.

Aarogyasri తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Aarogyasri : తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Aarogyasri  ఆరోగ్యశ్రీ సేవలు 1000 కోట్లకు పైగానే బకాయిలు

పెండింగ్ బకాయిల వల్ల ఆస్పత్రులు ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్నాయని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల ఆసోసియేషన్ (తానా) పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్యశ్రీ సేవ లను కొనసాగించే పరిస్థితి లేదని స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయని తానా చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 9 నెలల బకాయిలు రూ.672 కోట్లు పెండింగ్‌లో ఉండగా కాంగ్రెస్‌ వచ్చాక అది మరింత పెరిగిందని చెబుతున్నారు.

గతంలో మొదట బిల్లులు పెట్టిన వారికే మొదట చెల్లింపు (ఫస్ట్ క్లెయిమ్, ఫస్ట్ పేమెంట్) తరహా పద్దతి ఉండేదని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో మొదట ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో ఆస్పత్రులు నడిపే పరిస్థితి లేదని తెలంగాణ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది. ప్రభుత్వం మాత్రం గత వారం కూడా రూ.40 కోట్లు విడుదలైందని, బకాయిలు రూ.400 కోట్లకు మించి ఉండవని చెబుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది