Singer Lakshmi : ప్రతిభ నైపుణ్యం ఉంటే అవకాశాలు దానంతట అవే తలుపు తట్టి దరిచేరుస్తాయి అనేది మనందరికి తెలిసిన నిజం. పల్లె జానపదాలతో అందరినీ అలరించే ఆ పాటలు వెండితెరకెక్కి పాపులర్ అవుతాయని కలలో ఊహించలేదు. సినిమా ఇండస్ట్రీలో పుష్ప-2 మూవీ రికార్డు బద్దలు కొడుతుంటే.. ఈ మూవీలోని ఆరింటికోసారి.. నువ్వు పక్కనుంటే ..ప్రతి ఒక్క సారి వచ్చిందాయి. ఫీలింగ్.. అనే పాట చిన్నపిల్లాడి నుండి మాస్ యూత్ వరకు ప్రతి చోటా మారుమోగిపోతోంది. ఈ పాటలోని డిఫరెంట్ వాయిస్ ప్రతి ఒక్కరికి ఎంతగానో నచ్చేసింది. మరి ఆ పాట పాడింది మరెవరో కాదు ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన మహిళా కావడం విశేషం. అయితే ఈ పాటకు ఇంత యమక్రేజ్ రావడం ఒక ఎత్తయితే.. డిఫరెంట్ వాయిస్ చాలా నచ్చింది.. అని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కితాబు ఇవ్వడం నాకు గొప్ప అనుభూతినిచ్చిందనీ సింగర్ దాస లక్ష్మి చెప్పుకొచ్చారు.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర మారుమూల గ్రామం దాస లక్ష్మణ్, జయశీల దంపతులకు రెండో కుమార్తెగా జన్మించిన సింగర్ లక్ష్మిదాస్ తన చిన్నప్పటి నుండి తల్లి జయశీల పాడే మరాఠి కీర్తనలు, మరాఠి పాటలు అనుకరిస్తూ తెలుగులో ఫోక్ సాంగ్స్ పాడుతుండేది. లక్ష్మి హై స్కూల్, ఇంటర్ వరకు ముధోల్ మండలంలోనే చదువుకున్నారు. నిజామాబాద్ లో డిగ్రీ చేశారు . పీజీ పొలిటికల్ సైన్స్ హైదరాబాదులో చదువుకున్నారు. ఓ బావో సైదులు, ఆనాడేమన్నంటిన తిరుపతి… తిన్నా తీరం పడతలే… అందాల నా మొగుడు, ముద్దుల రాయమల్లు, చలో చలో కమలమ్మ… అనే పాటలు ఆమెకి సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఈమె దసరా సినిమాలో కూడా పాట పాడే అవకాశాన్ని దక్కించుకుంది. లక్ష్మి దాస్ వాయిస్ ను మెచ్చుకొని మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె అవకాశం ఇవ్వడంతోనే పుష్ప 2.. సినిమాలో ఆరింటికోసారి అనే పాట పాడే అవకాశం తనకు లభించిందని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తుంది.అమ్మ పాడిన పాటలను అనుకరిస్తూ సింగర్‌గా ఎదిగాను, స్కూల్ టీచర్లంతా ఎంతగానో ప్రోత్సహించారు. పల్లెటూరి నుంచి పైస్థాయికి ఎదగడం నా అదృష్టం అంటూ లక్ష్మీ దాస్ పేర్కొంది.
Manchu Family : మంచు ఫ్యామిలీ గొడవలు రోడ్డున పడ్డాయి. మంచు మనోజ్ కి తన ఇంట్లో స్థానం లేదని…
Subsidy Tractors : రైతే దేశానికి వెన్నెముక అంటారు. అటువంటి రైతన్న ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంత విలవిలలాడుతున్నారు.…
Traffic Challan : ఇటీవల కొన్ని ప్రభుత్వాలు రూల్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Annamalai : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలవడం పాపం కాదు అని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు.…
Aadhaar Card : ఆధార్ కార్డులోని ఫొటోతో అసంతృప్తిగా ఉన్నారా? ఆధార్ కార్డ్‌లోని పాత ఫోటోను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ కార్డ్‌లోని…
Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు…
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి మరో భారీ…
This website uses cookies.