Singer Lakshmi : పుష్ప‌2లో ఫీలింగ్ సాంగ్‌తో మ‌నంద‌రికి ఫీలింగ్ తెప్పించిన సింగ‌ర్ మ‌న తెలంగాణ అమ్మాయే..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 8 December 2024, 4:00 pm
  •  Singer Lakshmi : పుష్ప‌2లో ఫీలింగ్ సాంగ్‌తో మ‌నంద‌రికి ఫీలింగ్ తెప్పించిన సింగ‌ర్ మ‌న తెలంగాణ అమ్మాయే..!

Singer Lakshmi : ప్రతిభ నైపుణ్యం ఉంటే అవకాశాలు దానంతట అవే తలుపు తట్టి దరిచేరుస్తాయి అనేది మ‌నంద‌రికి తెలిసిన నిజం. పల్లె జానపదాలతో అందరినీ అలరించే ఆ పాటలు వెండితెరకెక్కి పాపులర్ అవుతాయని కలలో ఊహించలేదు. సినిమా ఇండస్ట్రీలో పుష్ప-2 మూవీ రికార్డు బద్దలు కొడుతుంటే.. ఈ మూవీలోని ఆరింటికోసారి.. నువ్వు పక్కనుంటే ..ప్రతి ఒక్క సారి వచ్చిందాయి. ఫీలింగ్.. అనే పాట చిన్నపిల్లాడి నుండి మాస్ యూత్ వరకు ప్రతి చోటా మారుమోగిపోతోంది. ఈ పాట‌లోని డిఫ‌రెంట్ వాయిస్ ప్ర‌తి ఒక్క‌రికి ఎంత‌గానో న‌చ్చేసింది. మ‌రి ఆ పాట పాడింది మ‌రెవ‌రో కాదు ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన మహిళా కావడం విశేషం. అయితే ఈ పాటకు ఇంత యమక్రేజ్ రావడం ఒక ఎత్తయితే.. డిఫరెంట్ వాయిస్ చాలా నచ్చింది.. అని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కితాబు ఇవ్వడం నాకు గొప్ప అనుభూతినిచ్చిందనీ సింగర్ దాస లక్ష్మి చెప్పుకొచ్చారు.

Singer Lakshmi : పుష్ప‌2లో ఫీలింగ్ సాంగ్‌తో మ‌నంద‌రికి ఫీలింగ్ తెప్పించిన సింగ‌ర్ మ‌న తెలంగాణ అమ్మాయే..!

Singer Lakshmi : పుష్ప‌2లో ఫీలింగ్ సాంగ్‌తో మ‌నంద‌రికి ఫీలింగ్ తెప్పించిన సింగ‌ర్ మ‌న తెలంగాణ అమ్మాయే..!

Singer Lakshmi ఆదిలాబాద్ వాసి..

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర మారుమూల గ్రామం దాస లక్ష్మణ్, జయశీల దంపతులకు రెండో కుమార్తెగా జన్మించిన సింగర్ లక్ష్మిదాస్ తన చిన్నప్పటి నుండి తల్లి జయశీల పాడే మరాఠి కీర్తనలు, మరాఠి పాటలు అనుకరిస్తూ తెలుగులో ఫోక్ సాంగ్స్ పాడుతుండేది. లక్ష్మి హై స్కూల్, ఇంటర్ వరకు ముధోల్ మండలంలోనే చదువుకున్నారు. నిజామాబాద్ లో డిగ్రీ చేశారు . పీజీ పొలిటికల్ సైన్స్ హైదరాబాదులో చదువుకున్నారు. ఓ బావో సైదులు, ఆనాడేమన్నంటిన తిరుపతి… తిన్నా తీరం పడతలే… అందాల నా మొగుడు, ముద్దుల రాయమల్లు, చలో చలో కమలమ్మ… అనే పాటలు ఆమెకి సోష‌ల్ మీడియాలో మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఈమె ద‌సరా సినిమాలో కూడా పాట పాడే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. లక్ష్మి దాస్ వాయిస్ ను మెచ్చుకొని మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె అవకాశం ఇవ్వడంతోనే పుష్ప 2.. సినిమాలో ఆరింటికోసారి అనే పాట పాడే అవకాశం త‌న‌కు ల‌భించింద‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకొస్తుంది.అమ్మ పాడిన పాటలను అనుకరిస్తూ సింగర్‌గా ఎదిగాను, స్కూల్ టీచర్లంతా ఎంతగానో ప్రోత్సహించారు. పల్లెటూరి నుంచి పైస్థాయికి ఎదగడం నా అదృష్టం అంటూ ల‌క్ష్మీ దాస్ పేర్కొంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి