KCR : ఆ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కెసిఆర్?? అందుకే BRS ధీమాగా ఉంది..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: July 5, 2023, 9:00 pm

KCR : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇంకో మూడు నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చే లోపు తెలంగాణలో కొత్త ప్రభుత్వం వస్తుంది. అఫ్ కోర్స్ అది బీఆర్ఎస్సా, లేక వేరే పార్టీనా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం తెలంగాణలోని పార్టీలన్నీ ఎన్నికలపై చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు ప్రస్తుతం తెలంగాణలో కాస్తోకూస్తో ఆదరణ ఉన్న పార్టీలు. ఇక.. వైఎస్సార్టీపీ లాంటి చిన్న పార్టీలు కూడా ఉన్నాయి కానీ.. వాటి ప్రాబల్యం అంతగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.

అయితే.. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అయితే. ఈ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అధికారంలో ఉండటం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే కూడా అనుకూలమైన పరిస్థితులు బీఆర్ఎస్ కే ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ లుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా పెద్దగా వేరే పార్టీలోకి వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రం రెబల్ అయి వేరే పార్టీలో చేరారు. కానీ.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లు వేరే పార్టీలోకి మారేందుకు అంతగా ఇష్టపడటం లేదు. వేరే పార్టీలు టికెట్ ఇస్తామన్నా బీఆర్ఎస్ నేతలు ససేమిరా అంటున్నారు. కొందరు నేతలు బీజేపీ, కాంగ్రెస్ కు టచ్ లోనూ ఉన్నారట. కానీ.. బీఆర్ఎస్ నుంచి అంతగా వలసలు వెళ్లే అవకాశం అయితే లేదు.

KCR : ఆ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కెసిఆర్?? అందుకే BRS ధీమాగా ఉంది..!

KCR : ఆ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కెసిఆర్?? అందుకే BRS ధీమాగా ఉంది..!

KCR : సిట్టింగ్స్ అందరికీ సీట్లు ఇస్తారా?

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ టికెట్లు కన్ఫమ్ అయినట్టే. ఏదో కొంతమందికి టికెట్స్ దక్కకపోవచ్చు కానీ.. 90 శాతం అందరికీ మళ్లీ టికెట్లు ఇచ్చేందుకే కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ట్రాక్ రికార్డు సరిగ్గా లేని కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోతే వాళ్లు వెంటనే వేరే పార్టీలోకి జంప్ అయ్యే చాన్స్ ఉంది. అది కూడా వేరే పార్టీలు టికెట్ కన్ఫమ్ చేస్తేనే ఆయా పార్టీలోకి వెళ్లేందుకు కొందరు నేతలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ ఈసారి పక్కా వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎవ్వరినీ బయటికి వెళ్లకుండా ప్రతి ఎమ్మెల్యే మీద నిఘా కూడా పెట్టారట. అందుకే.. ఎమ్మెల్యేలు కూడా పెద్దగా వేరే పార్టీలోకి వెళ్లేందుకు సుముఖత చూపించకపోవడంతో హైకమాండ్ కూడా సైలెంట్ అయిపోయింది. చూద్దాం ఎన్నికలకు వరకు ఏం జరుగుతుందో?

Breaking News 2

No bio available for this author.

Tags :
  1. "Gold Rate Today : పసిడి ప్రియులకు మరో షాక్.. 25 నవంబర్ 2026 మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం తగ్గింది!"

  2. "Rashmi Gautam : రష్మితో లిప్‌లాక్ కావాలన్న కమెడియన్.. బుల్లెట్ భాస్కర్ కౌంటర్‌..!"

  3. "Chicken Shop Business : చికెన్ షాప్ పెడితే లాభమా.. న‌ష్ట‌మా..1 కిలోకు ఎంత మిగులుతుందంటే? అసలు లెక్కలు ఇవే!"

  4. "Today Horoscope : 25 నవంబర్ 2026 బుధ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

  5. "Huzurnagar News : నిరుద్యోగులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు.. రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"

  6. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

  7. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp